దారుణాతి దారుణంగా మహిళ హత్య.. దీపం పెట్టి.. వేళ్లు నరికేశారు..
నిజామాబాద్‌లో దారుణాతి దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్యనగర్‌లో లక్ష్మీ అనే మహిళను అత్యంత దారుణంగా హతమార్చారు గుర్తు తెలియని దుండుగులు. సోమవారం రాత్రి ఇంట్లోని సోఫాలో కూర్చుని టీవీ చూస్తుండగా..
నిజామాబాద్‌లో దారుణాతి దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్యనగర్‌లో లక్ష్మీ అనే మహిళను అత్యంత దారుణంగా హతమార్చారు గుర్తు తెలియని దుండుగులు. సోమవారం రాత్రి ఇంట్లోని సోఫాలో కూర్చుని టీవీ చూస్తుండగా.. ఆమెను దుండగులు నరికి చంపారు. అంతేకాకుండా.. ఆమె చనిపోయాక మృతదేహం ముందు దీపాలు పెట్టి ఇంట్లో కారం.. పసుపు జల్లి భయానక వాతావరణం సృష్టించారు. అక్కడితో ఆగకుండా కాలివేళ్లు కూడా నరికారు.. వాటిని మాయం చేశారు. అలాగే గొంతు కోసి, చేతి గోళ్లు తీసేసి అత్యంత దారుణంగా లక్ష్మిని హతమార్చారు దుండగులు. కాగా.. ఇంటికి భర్త వచ్చి చూసే సరికి.. హత్యకు గురైవున్న లక్ష్మిని చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఘటనా స్థలానికి క్లూస్ టీమ్‌తో వచ్చి.. హత్యపై విచారణ చేస్తున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో 5 తులాల బంగారం కూడా మాయమైంది. ఇది దొంగల పని అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు.
Read More: ఒంటరైన మారుతీరావు భార్య.. నేరం ఎవరిది? శిక్ష ఎవరికి!
శ్మశాన వాటికలో ఉద్రిక్త పరిస్థితులు.. కడసారి చూపుకు నోచుకోని అమృత
అమృత, ప్రణయ్‌ల లవ్‌స్టోరిపై సినిమా.. హీరో ఎవరంటే?
పొలిటికల్ పార్టీలకు రూ.2,512 కోట్ల విరాళాలు.. ఇచ్చిందెవరో తెలీదు!
నీకు సిగ్గుందా.. అంటూ అమృతపై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్