బ్రాయిలర్ vs నాటు కోడి.. ఇందులో ఏది బెస్ట్.. నాన్‌వెజ్ ప్రియులు నమ్మలేని నిజాలు..
చికెన్, మటన్, ఫిష్.. అబ్బో ఆదివారం వచ్చిందంటే.. చాలు చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా కొని తెచ్చుకుంటారు. అంతేకాకుండా.. పలు రకాలుగా వండుకుని ఆస్వాదిస్తూ తింటారు.. అయితే.. మాంసాహారుల్లో ఎప్పటికప్పుడు పలు సందేహాలు వ్యక్తమవుతుంటాయి.. మటన్ vs.. చికెన్.. చికెన్ లో.. బ్రాయిలర్ చికెన్, నాటు కోడి.. ఫిష్ ఏది మంచిది..?

చికెన్, మటన్, ఫిష్.. అబ్బో ఆదివారం వచ్చిందంటే.. చాలు చాలా మంది నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా కొని తెచ్చుకుంటారు. అంతేకాకుండా.. పలు రకాలుగా వండుకుని ఆస్వాదిస్తూ తింటారు.. అయితే.. మాంసాహారుల్లో ఎప్పటికప్పుడు పలు సందేహాలు వ్యక్తమవుతుంటాయి.. మటన్ vs.. చికెన్.. చికెన్ లో.. బ్రాయిలర్ చికెన్, నాటు కోడి.. ఫిష్ ఏది మంచిది..? దేనిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి.. అనే సందేహాలను వ్యక్తపరుస్తుంటారు.. మటన్‌తో పోలిస్తే చికెన్‌కు అధిక ఆరోగ్య ప్రయోజనాలు, తక్కువ ధర ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. మటన్ మెదడు, కాలేయం, రక్తం ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు..
చికెన్‌లో నాటు కోడి, బ్రాయిలర్ కోడి..
బ్రాయిలర్ కోడి.. నాటు కోడి.. ఏది మంచిదంటే.. దేనికదే పోషకాలకు ప్రసిద్ధి చెందింది.. బ్రాయిలర్.. కంటే నాటు కోడి అనేక విధాలుగా మంచిది.. బ్రాయిలర్ కోళ్లకు సమతుల్య పిండి పదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు కలిగిన రెడీమేడ్ మేతను అందిస్తారు. అంతేకాకుండా, వాటికి వ్యాధి నిరోధక టీకాలు వేసి, ఆరోగ్య స్థితిని నిరంతరం పర్యవేక్షిస్తారు. ఆర్.ఓ. వాటర్ అందించడం వల్ల అవి త్వరగా బరువు పెరిగి, ఎక్కువ గుడ్లు పెడతాయి. ఆరు వారాల్లోనే రెండు కేజీల బరువు పెరిగే బ్రాయిలర్ కోడి మాంసం వెన్నపూసలా మెత్తగా ఉంటుంది.. ఎముకలు కూడా కరకరలాడుతూ కాల్షియం అందిస్తాయి.. అయితే.. నాటు కోడి ఆహారం కోసం తిరుగుతూ ఉంటుంది.. ఎలాంటి రెడీమెడ్ ఉత్పత్తులు అందించకుండానే.. సహజసిద్ధంగా పెరుగుతుంది. దాని మాంసం గట్టిగా, ఎముకలు ముదిరిపోయి ఉంటాయి.
కోడి మాంసం భాగాలు – ప్రయోజనాలు: రెక్కలు, బ్రెస్ట్ భాగాల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయని, కాళ్ళలో తక్కువ ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. చర్మం విషయంలో, అధిక బరువు, కొలెస్ట్రాల్ ఉన్నవారు తినకూడదని, సన్నగా, బరువు పనులు చేసే వారు తినవచ్చని సూచిస్తున్నారు. పట్టణాల్లో నివసించే వారు, బరువు ఎక్కువ ఉన్నవారు స్కిన్లెస్ చికెన్ ఎంచుకోవడం మంచిది.
వంట పద్ధతుల విషయానికి వస్తే, మాంసాహారాన్ని కేవలం పులుసు రూపంలోనే తీసుకోవాలి.. రోస్ట్, ఫ్రై, వేపుడు వంటి పద్ధతుల వల్ల మాంసంలో ఉండే పోషక విలువలు, విటమిన్లు, ఖనిజ లవణాలు నశించిపోతాయని, కేవలం నాలుక రుచిని మాత్రమే సంతృప్తిపరుస్తాయని పేర్కొంటున్నారు.
చేపల్లో ఏది బెస్ట్..
చేపలు, రొయ్యల మధ్య చేపలకు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. చేపలను కూడా పులుసు రూపంలోనే తీసుకోవడం ఉత్తమమని, ఫ్రై చేయడం వల్ల పోషకాలు కోల్పోతాయని పేర్కొంటున్నారు డైటీషియన్లు.. బతికున్న చేప అయినా, ఐస్‌లో ఉంచిన చేప అయినా పోషక విలువల్లో తేడా ఉండదని, సముద్రపు చేపల వల్ల అయోడిన్ లభించి థైరాయిడ్ గ్రంధికి మేలు జరుగుతుందంటున్నారు.. పచ్చి చేపలు ఎండు చేపల కంటే ఆరోగ్యకరమైనవి, ఎందుకంటే ఎండు చేపల్లో ఉప్పు అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటు, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారికి మంచిది కాదు..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
