AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ్యుటెంట్ వైరస్ ఎఫెక్ట్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియా ట్రిప్ సాధ్యం కాకపోవచ్చు, యూకే డాక్టర్ వెల్లడి,

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియాకు రాకపోవచ్చు. దేశంలో మ్యుటెంట్ కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా..

మ్యుటెంట్ వైరస్ ఎఫెక్ట్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియా ట్రిప్ సాధ్యం కాకపోవచ్చు, యూకే డాక్టర్ వెల్లడి,
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 23, 2020 | 7:08 AM

Share

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియాకు రాకపోవచ్చు. దేశంలో మ్యుటెంట్ కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా..ఆయన ఇండియా పర్యటన ఉండకపోవచ్చునని బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ చాంద్ నాగ్ పాల్ అన్నారు. ప్రధాని ఇండియా విజిట్ పై బ్రిటన్ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉందని, ఏమైనా ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన పర్యటన అనుమానాస్పదమేనని చాంద్ నాగ్ పాల్ అభిప్రాయపడ్డారు. లండన్లోనూ, మరో నాలుగు ప్రాంతాల్లోనూ నాలుగంచెల లాక్ డౌన్ విధించినందున ఈ ఇన్ఫెక్షన్ అదుపులోకి వచ్చిన పక్షంలో అప్పుడు పరిస్థితిని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఇదే సమయంలో లాక్ డౌన్ ని మరికొంతకాలం పొడిగించే సూచనలు కూడా ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ లోని ఆసుపత్రుల్లో ఇదివరకటికన్నా కరోనా రోగుల సంఖ్య పెరిగిందని, చాలినన్ని పడకలు లేవని ఆయన తెలిపారు.

ఇలా ఉండగా ఈ స్ట్రెయిన్ కేసులు అప్పుడే సౌతాఫ్రికా, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా దేశాల్లోనూ కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని కొన్ని చోట్ల లాక్ డౌన్ విధించారు. సాధారణ వైరస్ కన్నా 70 శాతం ఎక్కువ ఇన్ఫెక్షన్ తో కూడినదని భావిస్తున్న ఈ వైరస్ ముప్పు నేపథ్యంలో బ్రిటన్ కు అనేక దేశాలు..ఇండియాతో సహా విమాన సర్వీసులను రద్దు చేశాయి.

Follow Us
మటన్, చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఇది తెలుసుకోండి
మటన్, చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఇది తెలుసుకోండి
టెన్త్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో బాలారిష్టాలు.. మే లోనే ఫలితాలు?
టెన్త్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో బాలారిష్టాలు.. మే లోనే ఫలితాలు?
పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి..!
పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి..!
ఈ సీజన్‌లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నది వీళ్లే
ఈ సీజన్‌లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నది వీళ్లే
అల్లు అర్జున్ సినిమాలో మరో అందాల తార..
అల్లు అర్జున్ సినిమాలో మరో అందాల తార..
ఏ విటమిన్ ఏ వ్యాధి నుంచి రక్షిస్తుంది..? కచ్చితంగా తెలుసుకోండి..
ఏ విటమిన్ ఏ వ్యాధి నుంచి రక్షిస్తుంది..? కచ్చితంగా తెలుసుకోండి..
లక్ష్మీదేవి చల్లని చూపు వీరిపైనే..బంగారం,భూమి కొనుగోలు చేయడం ఖాయం
లక్ష్మీదేవి చల్లని చూపు వీరిపైనే..బంగారం,భూమి కొనుగోలు చేయడం ఖాయం
అంగన్‌వాడి టీచర్‌ను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు.. ఏం జరిగిందంటే
అంగన్‌వాడి టీచర్‌ను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు.. ఏం జరిగిందంటే
నిరంకుశ ప్రభుత్వం కూలబోతోందిః ప్రధాని మోదీ
నిరంకుశ ప్రభుత్వం కూలబోతోందిః ప్రధాని మోదీ
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఎవరి సీటుకు ఎసరు పెడుతుందో ?
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఎవరి సీటుకు ఎసరు పెడుతుందో ?