చంబల్ నదిలో పడవ బోల్తా.. 10 మంది అచూకీ గల్లంతు

రాజస్తాన్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. చంబల్ నదిలో పడవ బోల్తాపడి 10 మంది గల్లంతైయ్యారు. కోటా జిల్లాలోని ఇటావా పట్టణానికి సమీపంలోని ఖతోలీ ప్రాతంలో చంబల్ నదిని దాటుతున్న ఒక పడవ నీట మునిగింది.

చంబల్ నదిలో పడవ బోల్తా.. 10 మంది అచూకీ గల్లంతు
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 16, 2020 | 10:59 AM

రాజస్తాన్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. చంబల్ నదిలో పడవ బోల్తాపడి 10 మంది గల్లంతైయ్యారు. కోటా జిల్లాలోని ఇటావా పట్టణానికి సమీపంలోని ఖతోలీ ప్రాతంలో చంబల్ నదిని దాటుతున్న ఒక పడవ నీట మునిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 50 మంది ప్రయాణీకులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ పడవలో 14 బైక్‌లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే స్థానికులు అప్రమత్తమయ్యారు. నీటి మునిగిన బాధితులను ఒడ్డుకు తీసుకువచ్చే ప్రయత్నిస్తున్నారు. 40 మంది క్షేమంగా దరికి చేర్చినప్పటికీ 10 మంది జాడ కనిపించడంలేదని స్థానికులు తెలిపారు. జరిగిన ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రత్యేక సహాయక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, స్థానిక మీడియా కథనం ప్రకారం, గోఠలా కాలా సమీపంలోని కమలేశ్వర్ ఆలయానికి వెళుతున్న పడవ చంబల్ నదిలో బోల్తా పడింది. పడవలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించిన కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము..
ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము..