సంఘ్ సార్వజనికోత్సవంలో కమలనాథుల సందడి

హైదరాబాద్ వేదికగా రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) నిర్వహించిన సార్వజనికోత్సవానికి తెలంగాణ బిజెపి నేతలు క్యూ కట్టారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రామ్ మాధవ్, రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌తోపాటు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు తదితరులు స్వయం సేవక్ డ్రెస్ కోడ్‌లో సార్వజనికోత్సవానికి హాజరయ్యారు.పూర్తి క్రమశిక్షణతో వేలాది మంది స్వయంసేవకులతో సరూర్‌నగర్ స్టేడియంలో మూడు రోజుల […]

సంఘ్ సార్వజనికోత్సవంలో కమలనాథుల సందడి
Rajesh Sharma

| Edited By: Srinu Perla

Dec 26, 2019 | 6:11 PM

హైదరాబాద్ వేదికగా రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) నిర్వహించిన సార్వజనికోత్సవానికి తెలంగాణ బిజెపి నేతలు క్యూ కట్టారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రామ్ మాధవ్, రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌తోపాటు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు తదితరులు స్వయం సేవక్ డ్రెస్ కోడ్‌లో సార్వజనికోత్సవానికి హాజరయ్యారు.పూర్తి క్రమశిక్షణతో వేలాది మంది స్వయంసేవకులతో సరూర్‌నగర్ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఆర్.ఎస్.ఎస్. శిబిరానికి ముగింపుగా నిర్వహించిన సార్వజనికోత్సవంలో స్వయంసేవకులు నిర్వహించిన పద సంచలన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పద సంచలన్‌లో పలువురు బిజెపి నేతలు డ్రెస్ కోడ్‌లో పాల్గొన్నారు.సార్వజనికోత్సవం ముగింపు సభలో ప్రధాన వక్తగా పాల్గొన్న ఆర్.ఎస్.ఎస్. సర్ సంఘ్ చాలక్ (చీఫ్) మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని హిందు, ముస్లింల పేరిట వేరువేరుగా చూడడం సంఘ్ అభిమతం కాదని, దేశంలో ఉన్న ప్రతీ ఒక్కరు ఏ మతానికి చెందిన వారైనా వారంతా భారతీయులేనని, ప్రతీ పౌరునిలో జాతీయతా భావం పెంపొందించడమే సంఘ్ పరివార్ సంకల్పమని చెప్పారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu