జగన్ సర్కార్‌పై సాధినేని యామిని విమర్శలు..

|

May 04, 2020 | 10:23 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సోమ‌వారం నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించింది ప్రభుత్వం. అంతేకాదు మద్యం ధరలు పెంచుతూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే క‌రోనా వ్యాప్తి అధికంగా ఉన్న వేళ‌ లిక్క‌ర్ అమ్మకాలకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రతిపక్షలు…ప్ర‌భుత్వంపై విమర్శల దాడి ప్రారంభించాయి. తాజాగా బీజేపీ నేత యామిని శర్మ ఏపీ స‌ర్కార్ పై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ కు ప్రాధాన్యతలు తెలియడం లేదని ఆమె ఆరోపించారు. లిక్క‌ర్ షాపులు తెరిస్తే…కోవిడ్-19 వ్యాప్తి […]

జగన్ సర్కార్‌పై సాధినేని యామిని విమర్శలు..
Follow us on

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సోమ‌వారం నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించింది ప్రభుత్వం. అంతేకాదు మద్యం ధరలు పెంచుతూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే క‌రోనా వ్యాప్తి అధికంగా ఉన్న వేళ‌ లిక్క‌ర్ అమ్మకాలకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రతిపక్షలు…ప్ర‌భుత్వంపై విమర్శల దాడి ప్రారంభించాయి.

తాజాగా బీజేపీ నేత యామిని శర్మ ఏపీ స‌ర్కార్ పై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ కు ప్రాధాన్యతలు తెలియడం లేదని ఆమె ఆరోపించారు. లిక్క‌ర్ షాపులు తెరిస్తే…కోవిడ్-19 వ్యాప్తి పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఆదాయం కోసం కేంద్రం ప్ర‌భుత్వాలు రాష్ట్రాలు ఒత్తిడి తెస్తున్నాయని యామిని శర్మ విమ‌ర్శించారు. కేంద్రం మద్యం అమ్మకాలకు ప‌ర్మిష‌న్ ఇచ్చినా రాష్ట్రాలు ఎందుకు అనుమతి ఇవ్వాలని ఆమె ప్రశ్నించారు. కాగా ఏపీ మ‌ద్యం షాపులు పునఃప్రారంభం చేసిన తొలిరోజు రూ.40 కోట్ల మ‌ద్యం విక్ర‌యాలు జ‌రిగిన‌ట్టు స‌మాచారం.