AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీని విష్ చేయాలా.. ఈ యాప్ నుంచి చాలా ఈజీ..

భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టిన రోజును బీజేపీ శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. పలు సేవా కార్యక్రమాలతో తమ అభిమాన నేత బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ప్రధాని మోదీకి విష్ చేయాలనుకునేవారు యాప్ ద్వారా చేయండి అని ప్రధాని కోరారు. ‘నమో యాప్’ ద్వారా తన పుట్టిన రోజు శుభకాంక్షలు..

ప్రధాని మోదీని విష్ చేయాలా.. ఈ యాప్ నుంచి చాలా ఈజీ..
Sanjay Kasula
|

Updated on: Sep 17, 2020 | 4:21 PM

Share

భారత ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టిన రోజును బీజేపీ శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. పలు సేవా కార్యక్రమాలతో తమ అభిమాన నేత బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ప్రధాని మోదీకి విష్ చేయాలనుకునేవారు యాప్ ద్వారా చేయండి అని ప్రధాని కోరారు. ‘నమో యాప్’ ద్వారా తన పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపాల్సిందిగా ప్రధాన మంత్రి మోదీ ప్రజలకు సూచించారు. ఈ మేరకు నమో యాప్‌ ద్వారా ప్రధానికి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ తాజాగా ఓ ప్రకటన వెలువరించింది. నమో యాప్‌ ద్వారానే ‘నో నమో (Know Namo)‌’ క్విజ్ నిర్వహిస్తున్నట్లు తాజాగా తమ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. అంతేగాక ఇందులో గెలిచిన వారికి ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్‌ ఉన్న పుస్తకాలు అందిస్తున్నట్లు పేర్కొంది. ఇవాళ ప్రారంభించే ఈ క్వీజ్‌ పోటీలో ప్రదానీ మోదీ, బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయని తెలిపింది.

‘ప్రధాని నరేంద్ర మోదీ గురించి తమకు ఏ మేర అవగాహన ఉందో తెలుసుకోవాలంటే ఈ ‘నమోయాప్’‌లో ఈ రోజు నిర్వహించే ‘ది నో నమో’ క్వీజ్‌లో పాల్గొనాలని…  http://nm4.in/dnldapp లింక్ ద్వారా‌ ఈ యాప్‌ డౌన్‌లోడ్‌‌ చేసుకోవాలని ‌ ట్విటర్‌లో పేర్కొంది.

అంతేగాక ప్రధానికి శుభాకాంక్షలు , కృతజ్ఞతలు చెప్పాలనుకునే వారు తమ సందేహలను కూడా ఈ యాప్‌లో వీడియో అప్‌లోడ్‌ చేయాల్సిందిగా బీజేపీ కోరింది. అలాగే నమో యాప్‌ వినియోగదారులంతా ప్రధాని జీవితం ఆధారంగా తోలిసారిగా 360 డిగ్రీల వీడియోను ఎగ్జిబిషన్‌ను చూడొచ్చని కూడా పార్టీ తెలిపింది.

గ్లింప్సెస్‌ ఆప్‌ నమో ఇన్‌స్పైరింగ్‌ లైఫ్‌ పేరుతో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్‌ ప్రధాని మోది స్వస్థలం గుజరాత్‌లోని వాడ్నగర్‌ నుంచి భారత ప్రధానిగా ఎదిగిన ఆయన జీవిత చరిత్రను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ సెప్టెంబర్‌ 14 నుంచి 20 వరకు ‘సేవా సప్తా’ కార్యక్రమాన్ని నిర్వహించి దీని ద్వారా పరిశుభ్రత, పారశుద్ధ్యం, ప్యాడ్లు, వీల్‌చైర్‌ల పంపిణీతో పాటు పలు సామాజిక సేవలను చేపట్టనుంది.

Follow Us