జూలై 6 నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు

తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తోంది బీజేపీ . మొత్తం 12 లక్షల మందితో బలమైన క్యాడర్‌ను తయారు చేసేందుకు హ్యూహాలు రెడీ చేస్తోంది. అందుకు తగ్గట్టగానే ఈ జూలై 6 నుంచి ఆగస్టు 11 వ వరకు కొత్త సభ్యుల్ని చేర్చుకునేందుకు స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే తెలంగాణలో 18 లక్షలమంది సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. వీరికి అదనంగా మరో 12 లక్షల మందిని చేర్చుకుంటే మొత్తం 30 లక్షలు సభ్యులున్న […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:32 pm, Wed, 3 July 19
జూలై 6 నుంచి బీజేపీ  సభ్యత్వ నమోదు

తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తోంది బీజేపీ . మొత్తం 12 లక్షల మందితో బలమైన క్యాడర్‌ను తయారు చేసేందుకు హ్యూహాలు రెడీ చేస్తోంది. అందుకు తగ్గట్టగానే ఈ జూలై 6 నుంచి ఆగస్టు 11 వ వరకు కొత్త సభ్యుల్ని చేర్చుకునేందుకు స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే తెలంగాణలో 18 లక్షలమంది సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. వీరికి అదనంగా మరో 12 లక్షల మందిని చేర్చుకుంటే మొత్తం 30 లక్షలు సభ్యులున్న పార్టీగా అవతరించే ఛాన్స్ ఉంది. ఇక  బీజేపీ అధిష్టానం ఆదేశాలతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది రాష్ట్ర కార్యవర్గం.

మరోవైపు పార్టీని కొత్త రక్తంతో నింపాలని, కొత్త వారికి ఆహ్వానం పలకాలని బీజేపీ యోచిస్తోంది. దీనికి అనుగుణంగానే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులు పార్టీ సభ్యత్వం పెంచడం కోసం కృషి చేయాలని బీజేపీ అధిష్టానం ఆదేశాలు జారీచేసింది. అందులో భాగంగానే త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్ధానాల్ని కైవసం చేసుకోవాలని టార్గెట్‌గా ‌పెట్టుకుంది. అదే విధంగా 2023లొ జరగబోయే ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టే దిశగా ఇప్పట్నుంచి అడుగులు వేయాలని చూస్తోంది బీజేపీ.

సభ్యత్వ నమోదు విషయంలో రూరల్ కంటే అర్బన్‌లోనే పార్టీ సభ్యత్వాన్ని పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది. మొత్తానికి తెలంగాణలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించేందుకు బీజేపీ ఇప్పటినుంచే ప్లాన్స్ రెడీ చేసుకుంటోంది. దీనికి తగ్గట్టుగా అడుగులు కూడా వేస్తోంది.