బెజవాడలో రెచ్చిపోయిన అల్లరిమూకలు
విజయవాడలో అర్థరాత్రి అల్లరిమూకలు చెలరేగాయి. బైక్‌కు సైడ్ ఇవ్వలేదన్న నెపంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను చితకబాదారు దుండగులు. తెలంగాణలోని నార్కెట్‌పల్లి బస్సు డిపోకు చెందిన బస్సు డ్రైవర్‌పై దాడి చేసి 25 వేలు ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ హైవేపై భవానిపురం దగ్గర ఈ ఘటన జరిగింది. గొల్లపూడి సెంటర్ దగ్గరకు రాగానే బస్సు అద్దాలు పగులకొట్టారు. దాదాపు 50 మంది ఈ దాడిలో పాల్గొన్నారు. పోలీసులు కొంతమంది యువకులని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరికొంత మంది కోసం గాలిస్తున్నారు. […]
విజయవాడలో అర్థరాత్రి అల్లరిమూకలు చెలరేగాయి. బైక్‌కు సైడ్ ఇవ్వలేదన్న నెపంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను చితకబాదారు దుండగులు. తెలంగాణలోని నార్కెట్‌పల్లి బస్సు డిపోకు చెందిన బస్సు డ్రైవర్‌పై దాడి చేసి 25 వేలు ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ హైవేపై భవానిపురం దగ్గర ఈ ఘటన జరిగింది. గొల్లపూడి సెంటర్ దగ్గరకు రాగానే బస్సు అద్దాలు పగులకొట్టారు. దాదాపు 50 మంది ఈ దాడిలో పాల్గొన్నారు. పోలీసులు కొంతమంది యువకులని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరికొంత మంది కోసం గాలిస్తున్నారు. దాడిలో బస్సు డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. అల్లరిమూకల వీరంగం చూసి ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్రగాయాల పాలైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు చికిత్స అందించారు.