ఆలయాన్ని అపవిత్రం చేస్తారా.. చితకబాదిన దుండగులు
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలిలో దారుణం చోటుచేసుకుంది. ఆలయ పరిసరాల్లో మాంసాహారం భోజనం చేస్తున్నారని నలుగురిపై దాడి చేశారు దుండగులు. బెల్ట్‌లతో, కర్రలతో వాళ్లను చితకబాదారు. బండబూతులు తిట్టారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు వ్యక్తులు కూర్చొని తింటుండగా ఈ దాడి జరిగింది. దుండగులు అక్కడికి రాగానే దాడి మొదలు పెట్టారు. కాలితో తన్నారు. వదిలేయాలని ప్రాధేయపడినప్పటికి వినలేదు. ఇష్టం వచ్చినట్లు కొట్టారు. […]
ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలిలో దారుణం చోటుచేసుకుంది. ఆలయ పరిసరాల్లో మాంసాహారం భోజనం చేస్తున్నారని నలుగురిపై దాడి చేశారు దుండగులు. బెల్ట్‌లతో, కర్రలతో వాళ్లను చితకబాదారు. బండబూతులు తిట్టారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు వ్యక్తులు కూర్చొని తింటుండగా ఈ దాడి జరిగింది. దుండగులు అక్కడికి రాగానే దాడి మొదలు పెట్టారు. కాలితో తన్నారు. వదిలేయాలని ప్రాధేయపడినప్పటికి వినలేదు. ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఈ దాడిలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కొంతమంది వారించినప్పటికి దుండగులు వినలేదు. ఆలయం కంపౌండ్‌లో భోజనం చేసిన్నందుకే ఈ దాడి జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. దాడి చేసిన వాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగులను గుర్తించామని.. త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.