బీహార్‌లో కరోనా కలకలం.. మంత్రి, ఎమ్మెల్యేకు పాజిటివ్..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో బీహార్ రాష్ట్ర మంత్రి దంపతులతో పాటు ఓ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ సోకింది. బీహార్ రాష్ట్ర మంత్రితోపాటు

బీహార్‌లో కరోనా కలకలం.. మంత్రి, ఎమ్మెల్యేకు పాజిటివ్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 30, 2020 | 10:00 AM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో బీహార్ రాష్ట్ర మంత్రి దంపతులతో పాటు ఓ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ సోకింది. బీహార్ రాష్ట్ర మంత్రితోపాటు అతని భార్యకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో వారిద్దరిని కటిహర్ హోటల్‌లోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఉత్తర బీహార్ ప్రాంతానికి చెందిన మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడటంతో అతన్ని ఐసోలేషన్ గదికి తరలించారు.గడచిన 24 గంటల్లో 389 మందికి కరోనా సోకింది.

ఢిల్లీ, మహారాష్ట్రలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. బీహార్ రాష్ట్రంలో గడచిన 13రోజుల్లో కరోనా రోగుల సంఖ్య రెట్టింపు అయింది. మే 23వతేదీ వరకు 61,220 మందికి పరీక్షలు చేయగా వారిలో 2,263 మందికి కరోనా సోకింది. మే 23 నుంచి జూన్ 5వరకు 91,263 మందికి పరీక్షలు చేయగా 4,451 మందికి కరోనా సోకింది. బీహార్ రాష్ట్రంలో కొవిడ్-19 కేసుల సంఖ్య రెట్టింపు అయిందని బీహార్ ఆరోగ్యశాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ సింగ్ చెప్పారు. బీహార్ రాష్ట్రంలోని మధుబనీ జిల్లాలో 153 కరోనా కేసులు, భాగల్ పూర్ జిల్లాలో 138 కేసులు బయటపడ్డాయి.

Also Read: ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో.. పీజీ మెడికల్‌ అడ్మిషన్లకు లైన్ క్లియర్..!