అసోం, బిహార్ రాష్ట్రాల్లో వరద బీభత్సం.. 94 మంది మృతి
అసోం, బిహార్ రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటివరకూ 94 మంది మృతి చెందారు. నివాసాలు లేక నిరాశ్రయులైన లక్షలాది మందిని సహాయక శిబిరాలకు తరలించారు. జనావాసాల్లోకి నీరు చేరడంతో సుమారు 427 పడవలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ఎన్టీఆర్‌ఎఫ్ సిబ్బంది. ఇక అసోంలో వరదల్లో చిక్కుకున్న బరాక్ వ్యాలీ, కరిమ్‌గంజ్‌తో పాటు మరిన్ని ప్రాంతాలను సీఎం సర్బానందా సోనోవాల్ సందర్శించారు. ప్రస్తుత పరిస్థితిని […]
అసోం, బిహార్ రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటివరకూ 94 మంది మృతి చెందారు. నివాసాలు లేక నిరాశ్రయులైన లక్షలాది మందిని సహాయక శిబిరాలకు తరలించారు. జనావాసాల్లోకి నీరు చేరడంతో సుమారు 427 పడవలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు ఎన్టీఆర్‌ఎఫ్ సిబ్బంది. ఇక అసోంలో వరదల్లో చిక్కుకున్న బరాక్ వ్యాలీ, కరిమ్‌గంజ్‌తో పాటు మరిన్ని ప్రాంతాలను సీఎం సర్బానందా సోనోవాల్ సందర్శించారు. ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరచాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. వరదనీరు పోటెత్తి బ్రహ్మపుత్ర నదిలో గంటగంటకు నీటిమట్టం పెరుగుతోంది. జోర్హత్, తేజ్‌పుర్, గువహటి, గోల్పారా, ధుబ్రి ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. బ్రహ్మపుత్రతో పాటు రాష్ట్రంలోని సుబన్సిరి, ధాన్సిరి, జియా భరాలి, పుతిమారి నదుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాగా నేపాల్‌లో భారీ వర్షాల కారణంగా బీహార్‌లో వరదలు ఉగ్రరూపం దాల్చాయి.