సామాజిక సేవ కోసమే రాజీనామాః గుప్తేశ్వర్ పాండే

బీహార్ రాష్ట్ర డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అందుకు కారణాలను ఆయన బుధవారంనాడు మీడియాకు వెల్లడించారు.

సామాజిక సేవ కోసమే రాజీనామాః గుప్తేశ్వర్ పాండే
Follow us

|

Updated on: Sep 23, 2020 | 3:18 PM

బీహార్ రాష్ట్ర డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అందుకు కారణాలను ఆయన బుధవారంనాడు మీడియాకు వెల్లడించారు. వీఆర్ఎస్ తీసుకోవడం తన రాజ్యాంగపరమైన హక్కు అని అన్నారు. రెండు నెలలుగా తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, జీవితం దుర్భరంగా అనిపించిందని మనో వేధనను వ్యక్తం చేశారు. రిటైర్‌మెంట్ ఎప్పుడంటూ వేలాది ఫోన్ కాల్స్ వచ్చాయని.. వీటితో బాగా విసిగిపోయానని గుప్తేశ్వర్ పాండే తెలిపారు. దీంతో మానసిక ప్రశాంతత కోసం రాజీనామా చేశానని ప్రకటించారు. బీహార్ పోలీసుల పట్ల ముంబై పోలీసులు అనుచితంగా ప్రవర్తంచినప్పుడే తాను పోరాటం చేయాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. బీహార్ ప్రజల ప్రతిష్ట కోసం పోరాడాలనుకున్నానని పాండే తెలిపారు.

సుశాంత్ కేసుతో తన వీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు పాండే. సుశాంత్‌ తండ్రికి పోలీసు అండగా నిలుస్తారని, సుశాంత్ కేసుకు సంబంధించి దర్యాప్తు చేసేందుకు బీహార్ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్ధించిందని వెల్లడించారు. 34 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో ఏ నేరస్థుడి విషయంలోనూ తాను రాజీపడలేదని, 50 ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నానని వివరించారు. అయితే, తాను రాజకీయాల్లో చేరుతున్న వార్తలను ఆయన ఖండించారు. ప్రస్తుతానికైతే తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదని, దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదని పాండే తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండానే సామాజిక సేవ చేయవచ్చని మాజీ డీజీపీ వివరించారు.

భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!