Bigg Boss 4: అవినాష్ ను తన్నిన మోనాల్.. చూసి ఆడు అంటూ వార్నింగ్ ఇచ్చిన అఖిల్
బిగ్ బాస్4 చివరి దశకు వచ్చేసరికి అందరిలోనూ టెన్షన్ మొదలయ్యింది. మిగిలిన ఏడుగురిలో ఎవరు విజేత అవుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. సోమవారం ఇచ్చిన టాస్క్ లో కంటెస్టెంట్ ల మధ్య పెద్ద రచ్చే జరిగింది. టాస్క్ లో భాగంగా హౌస్ లో ఉంచిన ఆవు బొమ్మ నుంచి పాలను తమ బాటిల్స్ లో నింపాలని చెప్పాడు బిగ్ బాస్.

బిగ్ బాస్4 చివరి దశకు వచ్చేసరికి అందరిలోనూ టెన్షన్ మొదలయ్యింది. మిగిలిన ఏడుగురిలో ఎవరు విజేత అవుతారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. సోమవారం ఇచ్చిన టాస్క్ లో కంటెస్టెంట్ ల మధ్య పెద్ద రచ్చే జరిగింది. టాస్క్ లో భాగంగా హౌస్ లో ఉంచిన ఆవు బొమ్మ నుంచి పాలను తమ బాటిల్స్ లో నింపాలని చెప్పాడు బిగ్ బాస్. ఎవరిదగ్గరైతే ఎక్కువ బాటిల్స్ ఉంటే వారే లెవల్ 2కు వెళ్తారని చెప్పడంతో ఇంటి సభ్యులంతా పోటీపడ్డారు. అయితే ఉన్న సభ్యుల్లో అవినాష్ కాస్తా అతి తెలివి చూపించే ప్రయత్నం చేసి గేమ్ నుంచి అవుట్ అయ్యాడు. అంతకు ముందు పాలు పట్టుకునే క్రమంలో కంటెస్టెంట్స్ మధ్య వాగ్వాదం జరిగింది. బజర్ మోగగానే ఇంటి సభ్యులు ఒకరితో ఒకరు పోటీ పడి పాలు పట్టుకోవడానికి కిందా మీదా పడ్డారు. ఈ క్రమంలో కొందరికి దెబ్బలు కూడా తగిలాయి. ఇక అఖిల్, సొహైల్, అవినాష్, హారిక డైరెక్ట్‌గా పాల కేన్‌లు తీసుకువెళ్లి ఆవుకింద పెట్టేశారు. అరియానా, మోనాల్‌లకు పాలు పట్టే అవకాశమే లేకుండా పోయింది. పాల బాటిల్స్ ఎందుకు ఇచ్చారు దాంట్లో కదా పాలు పట్టాలి ? పాల క్యాన్‌లు పెడితే మిగిలిన వాళ్లు ఎలా పట్టుకోవాలని అరియానా అడగడంతో.. ముందుగా క్యాన్ పట్టుకెళ్లి ఆవుకింద పెట్టిన అఖిల్.. దిమాక్ పెట్టి ఆడటం అంటే ఇదే అంటూ అరియానాకి కౌంటర్ ఇచ్చాడు.
ఇక మోనాల్ పట్టుకున్న పాలను దొంగిలించాడు అవినాష్. దాంతో ఆ ఇద్దరిమధ్య కొట్లాట జరిగింది. ఆతర్వాత పాలు పట్టుకునే క్రమంలో మోనాల్ అవినాష్ ను తన్నింది. దాంతో మోనాల్ షూ లాగేసి విసిరేసాడు అవినాష్. దానికి అవును నేను తన్నా.. నువ్ నన్ను తోస్తున్నావ్ అని అరుస్తూ ఎదురు తిరిగింది మోనాల్. దాంతో అవినాష్ మోనాల్ దగ్గరకు వచ్చి నేను కూడా తన్నుతా అన్నాడు. ఇంతలో అఖిల్ కలుగజేసుకొని బ్రదర్ చూసి ఆడు అని చెప్పడంతో.. ఎవరూ మాట్లాడకండి.. ఆమె తన్నినప్పుడు ఎవరూ మాట్లాడలేదు.. అమ్మాయి అంటే చాలు సపోర్ట్ చేసేస్తారు. నా గేమ్ నన్ను ఆడనివ్వండి. టీంలు టీంలు గా ఆడుతున్నారు.. నేను ఈ టాస్క్ ఆడను అని అరుస్తూ కెమెరా ముందుకు వచ్చి బిగ్ బాస్ కు చెప్పుకున్నాడు అవినాష్. అయితే చివరికి అరియానా కూడా అవినాష్ నువ్ చాలా రాష్‌గా బిహేవ్ చేస్తున్నావ్.. అని అనడంతో నీ ఆట నువ్ ఆడు అంటూ ఆమె మీద కూడా ఫైర్ అయ్యాడు అవినాష్. ఇక గేమ్ ఆడను ఇంటికి వెళిపోతా.. ఎలిమినేట్ చేసి దొబ్బండి.. నాకు అవసరం లేదు అంటూ కాసేపు ఎగిరాడు అవినాష్. ఇలాగైతే నేను గేమ్ ఆడలేను అని కిచెన్‌లోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నాడు అవినాష్. ఆతర్వాత అతి తెలివి ప్రదర్శిస్తూ..ఆవు నుంచి వచ్చిన పాలతో కాకుండా ఫ్రిడ్జ్‌లో ఉంచిన పాలను తన కేన్‌లో వేసి.. నీళ్లు కలిపాడు అవినాష్. దాంతో అవినాష్ దగ్గర ఉన్న బాటిల్స్ లెక్కలోకి రావని బిగ్ బాస్ చెప్పడంతో గేమ్ నుంచి అవుట్ అయ్యాడు. ఇక ఈ వారం నామినేషన్ లో కూడా అవినాష్ ఉండటంతో అతడు బిగ్ బాస్ వదిలి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.




