తలసానితో రాహుల్ సిప్లిగంజ్ భేటీ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడా.?
కింగ్ నాగార్జున హోస్టుగా వ్యవహరించిన ‘బిగ్ బాస్’ సీజన్ 3కి రాక్‌స్టార్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. యాంకర్ శ్రీముఖి, రాహుల్ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ప్రేక్షకులు రాహుల్‌కే ఓటు వేశారు. ‘బిగ్ బాస్’ ఫైనల్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిధిగా విచ్చేసి.. విన్నర్‌కు రూ.50 లక్షలు, ట్రోఫీని అందజేసిన సంగతి విదితమే. ఇదిలా ఉండగా తాజాగా రాహుల్ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఫోటో […]
కింగ్ నాగార్జున హోస్టుగా వ్యవహరించిన ‘బిగ్ బాస్’ సీజన్ 3కి రాక్‌స్టార్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. యాంకర్ శ్రీముఖి, రాహుల్ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ప్రేక్షకులు రాహుల్‌కే ఓటు వేశారు. ‘బిగ్ బాస్’ ఫైనల్‌కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిధిగా విచ్చేసి.. విన్నర్‌కు రూ.50 లక్షలు, ట్రోఫీని అందజేసిన సంగతి విదితమే. ఇదిలా ఉండగా తాజాగా రాహుల్ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మంత్రి తలసానితో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రాహుల్.. ‘డైనమిక్ లీడర్.. డౌన్ టు ఎర్త్..’ అంటూ తలసానిని పొగిడేశాడు. ఆయన్ని కలవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్న రాహుల్ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు రాజకీయాల్లో చేరతాడేమో అనే సందేహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు టైటిల్ గెలిచిన ఆనందంలో కలిశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram