AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ కేపిటల్స్‌కు పెద్ద షాక్.. గాయంతో కీలక బౌలర్ ఔట్

తాజా ఐపీఎల్ టోర్నీలో దూసుకుపోతున్న ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు షాక్ తగిలింది. ఢిల్లీ కేపిటల్స్ జట్టులో మోస్ట్ డిపెండబుల్ బౌలర్‌గా భావిస్తున్న లెగ్ స్పిన్నర్...

ఢిల్లీ కేపిటల్స్‌కు పెద్ద షాక్.. గాయంతో కీలక బౌలర్ ఔట్
Rajesh Sharma
|

Updated on: Oct 05, 2020 | 4:43 PM

Share

Big shock to Delhi capitals team:  తాజా ఐపీఎల్ టోర్నీలో దూసుకుపోతున్న ఢిల్లీ కేపిటల్స్ జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టులో మోస్ట్ డిపెండబుల్ బౌలర్‌గా భావిస్తున్న లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా గాయంతో మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఢిల్లీ కేపిటల్స్ అధికారికంగా ప్రకటించింది.

లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా గత శనివారం షార్జాలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. బంతిని అందుకునే క్రమంలో బౌలింగ్ వేళ్ళలోని నరాలు దెబ్బతిన్నాయి. ఆదివారం అమిత్ మిశ్రాకు స్కానింగ్ నిర్వహించామని నరాలు దెబ్బతినడంతో కొంతకాలం పాటు మిశ్రా బౌలింగ్ చేయలేడని వైద్యులు తెలిపారని ఢిల్లీ కేపిటల్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘‘నిజానికి కోల్‌కతా నైట్‌రైడ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో మిశ్రా చక్కగా బౌలింగ్ చేశాడు. ఇప్పుడు అతనికి ప్రత్యామ్నాయం వెతకడం కష్టమైన పని.. ఇది నిజంగా మా జట్టుకు షాకే’’ అని డీసీ ప్రతినిధి వ్యాఖ్యానించాడు.

ఢిల్లీ డేర్ డెవిల్స్‌ నుంచి ఢిల్లీ కేపిటల్స్‌గా మారిన ఈ జట్టు తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్, షార్జా, అబుదాబీ వేదికలుగా జరుగుతున్న ఐపీఎల్ 2020 టోర్నీలో దూకుడును ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ జట్టు మూడింటిని గెలిచి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. అయితే జట్టులో కీలక బౌలర్‌గా భావించే అమిత్ మిశ్రా గాయంతో టోర్నీ మొత్తానికి దూరం కావడం జట్టు ప్రదర్శన మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.

Also read: సముద్రంలో చైనాకు చెక్.. ‘స్మార్ట్‘ ప్రయోగం సక్సెస్

Also read: కోవాక్సిన్‌లో అదనపు ఔషధం..అదే కీలకం!

Also read: కాంగ్రెస్ గూటికి చెరుకు ఫ్యామిలీ..! దుబ్బాకే టార్గెట్