AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: రెఫరెండమా? మళ్లీ ఎన్నికలా? అమరావతిపై తేల్చుకుంటారా?

రాజధాని ఉద్యమంపై మాటల తూటాలు పేలుతున్నాయి. అమరావతిని చిదిమేస్తున్నారని టీడీపీ నేత లోకేష్‌ అంటున్నారు. అయితే అంతసీను లేదు తెలివి తక్కువగా మాట్లాడి మూడు ప్రాంతాల తెలుగుదేశమే శత్రువుగా మారిందన్నారు వైసీపీ

Big News Big Debate: రెఫరెండమా? మళ్లీ ఎన్నికలా? అమరావతిపై తేల్చుకుంటారా?
Sanjay Kasula
|

Updated on: Oct 13, 2020 | 11:01 PM

Share

రాజధాని ఉద్యమంపై మాటల తూటాలు పేలుతున్నాయి. అమరావతిని చిదిమేస్తున్నారని టీడీపీ నేత లోకేష్‌ అంటున్నారు. అయితే అంతసీను లేదు తెలివి తక్కువగా మాట్లాడి మూడు ప్రాంతాల తెలుగుదేశమే శత్రువుగా మారిందన్నారు వైసీపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక మూడు రాజధానులకు 13 జిల్లాల ప్రజలు మద్దతు ఉందన్నమంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై బహిరంగ సవాల్‌ విసిరారు సీపీఐ నేత. రిఫరెండంకు వెళదామని.. ఒక్క ఓటు అధికంగా వచ్చినా.. అమరావతిపై మళ్లీ ఉద్యమాలే చేయమంటున్నాయి లెఫ్ట్‌ పార్టీలు. ఇలా నేతల మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లు నడుస్తుండగానే రాజధానిపై ఎన్నికలకు వెళితే మంచిదే అంటూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వ్యాఖ్యలు మరో సంచలనంగా మారాయి.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని స్థానికులు చేస్తున్న ఉద్యమం నిన్నటికి మూడొందల రోజుకు చేరింది. సోమవారం వారికి మద్దతుగా ఆందోళనలు చేసింది తెలుగుదేశం పార్టీ. లోకేష్ పర్యటన అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధానికి తెరతీసింది. గతంలో రాజధానికి అంగీకరించి ఇప్పుడు మాటమార్చారన్నారు లోకేష్‌. రైతుల పట్ల హేళనగా మాట్లాడుతున్న మంత్రులకు త్వరలోనే ప్రజలు బుద్ది చెబుతారన్నారు.

తమ బినామీలను ముందుంచి.. నిజమైన రైతులను ముంచే పనిలో తెలుగుదేశం ఉందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. అమరావతి అంశంపై చంద్రబాబుకు ఏమాత్రం సీరియస్‌నెస్‌ లేదని విమర్శించారు. ఉద్యమాన్ని ముందుండి ఎందుకు నడపడం లేదని.. లోకేష్‌ కూడా చుట్టుపు చూపుగా ఎందుకొస్తున్నారని ప్రశ్నించారు. కెమెరా ఉద్యమాలు ఆపితే రెండేళ్లలో అమరావతి డెవలప్‌ చేసి చూపిస్తామన్నారు. అమరావతిలో ఉన్న వాళ్లే రైతులు అన్నట్లు… మిగిలిన వాళ్లు కాదన్నట్లు ప్రతిపక్ష నేత తీరు ఉందని విమర్శించారు. కరోనా అనగానే హైదరాబాద్‌కు పారిపోయిన వాళ్లు… అమరావతి అనగానే బాగా తిని వచ్చి డ్రామా ఆర్టిస్టుల్లా చేస్తున్నారని కామెంట్‌ చేశారు రోజా. 3రాజధానులకు 13 జిల్లాల మద్దతు ఉందన్న మంత్రి బొత్స వ్యాఖ్యలపై సవాల్ విసిరారు లెఫ్ట్‌ పార్టీ నేతలు. ప్రజాభిప్రాయానికి వెళదామని.. ఒక్క ఓటు అధికంగా వచ్చినా అమరావతిపై మాట్లాడబోమని సీపీఐ నేతలు అంటున్నారు.

అటు రాజకీయ పార్టీలమధ్య వార్‌ నడుస్తుండగానే… 3 రాజధానులు వద్దని విపక్షం. కావాలనిఅధికారపక్షం అంటున్నాయి.. రాజనామాలు చేసి తేల్చకుంటే క్రెడిబులిటీ వస్తుందన్నఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అమరావతి వేదికగా జరుగుతున్న రాజకీయ యుద్ధం మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Follow Us
జ్యేష్ఠ అమావాస్య: ఈ తప్పులు చేస్తే లక్ష్మీ కటాక్షం దూరమవుతుందా..?
జ్యేష్ఠ అమావాస్య: ఈ తప్పులు చేస్తే లక్ష్మీ కటాక్షం దూరమవుతుందా..?
డైట్ ఖర్చు లేకుండా బరువు తగ్గాలంటే జొన్నలతో ఇలా..
డైట్ ఖర్చు లేకుండా బరువు తగ్గాలంటే జొన్నలతో ఇలా..
6 రోజులు.. 5దేశాలు.. యుద్ధం వేళ ప్రధాని మోదీ విదేశీ టూర్..
6 రోజులు.. 5దేశాలు.. యుద్ధం వేళ ప్రధాని మోదీ విదేశీ టూర్..
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన కావేరి ట్రావెల్
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన కావేరి ట్రావెల్
చిమ్నీ శుభ్రం చేయడం కష్టమా? ఈ సులభమైన పద్ధతులతో ఇక టెన్షన్ లేదు!
చిమ్నీ శుభ్రం చేయడం కష్టమా? ఈ సులభమైన పద్ధతులతో ఇక టెన్షన్ లేదు!
ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
పెట్రో భారం తర్వాత సామాన్యులకు మరో షాక్.. CNG ధర కూడా పెంపు..
పెట్రో భారం తర్వాత సామాన్యులకు మరో షాక్.. CNG ధర కూడా పెంపు..
మన అకౌంట్‌లో పొరపాటున డబ్బు క్రెడిట్‌ అయితే ఏం చేయాలి?
మన అకౌంట్‌లో పొరపాటున డబ్బు క్రెడిట్‌ అయితే ఏం చేయాలి?
మీకు అతిగా వేడి అనిపిస్తుందా? శరీరంలో ఆ విటమిన్ తగ్గిందేమో
మీకు అతిగా వేడి అనిపిస్తుందా? శరీరంలో ఆ విటమిన్ తగ్గిందేమో
అద్భుతం.. శివాలయం తలుపులు తెరవగానే కనిపించిన సీన్ చూసి..
అద్భుతం.. శివాలయం తలుపులు తెరవగానే కనిపించిన సీన్ చూసి..