AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రంలో దంచికొడుతున్న వర్షాలు

హైద్రాబాద్ మహానగరంలో భారీ వర్షం జన జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ప్రజలను ఇబ్బందికి గురి చేస్తోంది.

రాష్ట్రంలో దంచికొడుతున్న వర్షాలు
Balaraju Goud
|

Updated on: Oct 13, 2020 | 8:58 PM

Share

హైద్రాబాద్ మహానగరంలో భారీ వర్షం జన జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ప్రజలను ఇబ్బందికి గురి చేస్తోంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ వద్ద ఇవాళ ఉదయం తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఇది తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వైపు ప్రయాణిస్తోంది.

తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ లో 24.3, రామన్నపేట19.9 , గుండాల లో 16.1, బీబీనగర్ లో 15, తుర్కపల్లి 14.8, భువనగిరి 14.6, బొమ్మల రామారం 13.2, సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా త్రిపురారం లో 16.9, చండూరు 16.7, నల్గొండ 15.8, అడవిదేవులపల్లి 15.3, మాడుగుల పల్లి 12.6, మునుగోడు 12.5, అనుముల హాలియా 12.4, నార్కట్పల్లి 11.8, తిప్పర్తి 11.7, కట్టంగూర్ 11.4, నిడమనూరు 11, చింతలపల్లి 11.1, సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. అటు సిద్దిపేట , జనగాం జిల్లాల్లో ములుగు లో 11సెంటీమీటర్ల వర్షపాతం

అటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా కీసరలో 14.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ లో 21, కీసర 18, ఉప్పల్ 13.9, కాప్రా 12.7, ఎల్బీనగర్ లో 11 , అల్వాల్ , మల్కాజ్ గిరి, బాలనగర్, మారేడ్ పల్లి ఏరియాల్లో 9నుంచి 10 సెంటీమీటర్ల వర్షం నమోదు కాగా, సికింద్రాబాద్, ముషీరాబాద్, బండ్లగూడ చార్మినార్, సైదాబాద్ ఖైరతాబాద్ ఏరియాల్లో 8 సెంటీమీటర్లు, ఆసిఫ్ నగర్, అమీర్పేట్, తిరుమలగిరి ఏరియాల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు నమోదైంది. అటు రంగారెడ్డి జిల్లా హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ లో 16, ఇబ్రహీంపట్నం 15.6, సరూర్ నగర్ 12.2, మాంచల్ 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Follow Us