బిగ్ న్యూస్ బిగ్ డిబేట్.. జేపీ ఆలోచన విధానం!

గవర్నర్ వ్యవస్థ, పనితీరు ప్రత్యక్ష ఎన్నికల గురించి లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ గారు బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో వారి అభిప్రాయాలను తెలియజేశారు. మహారాష్ట్రలో జరుగుతున్న నాటకీయ పరిణామాల గురించి మాట్లాడుతూ.. గవర్నర్ రాజీనామా చేయాలి లేదా చేయించాలి అని చెప్పారు. గతంలో రామ్ లాల్ చేసినట్లుగా, ఉత్తర్ ప్రదేశ్ లో రమేష్ భండారి చేసినట్లుగా మహారాష్ట్ర గవర్నర్ రాజీనామా చేయాలని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన అజిత్‌ పవార్‌.. […]

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్.. జేపీ ఆలోచన విధానం!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 27, 2019 | 2:04 PM

గవర్నర్ వ్యవస్థ, పనితీరు ప్రత్యక్ష ఎన్నికల గురించి లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ గారు బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో వారి అభిప్రాయాలను తెలియజేశారు. మహారాష్ట్రలో జరుగుతున్న నాటకీయ పరిణామాల గురించి మాట్లాడుతూ.. గవర్నర్ రాజీనామా చేయాలి లేదా చేయించాలి అని చెప్పారు. గతంలో రామ్ లాల్ చేసినట్లుగా, ఉత్తర్ ప్రదేశ్ లో రమేష్ భండారి చేసినట్లుగా మహారాష్ట్ర గవర్నర్ రాజీనామా చేయాలని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన అజిత్‌ పవార్‌.. శరద్‌ పవార్‌ గూటికి రావడానికి రంగం సిద్ధమైంది. ఆయన ఎల్పీ నేత పోస్టును ఎన్‌సీపీ తొలగించిందిగానీ.. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయలేదు. దీంతో మలుపులు తిరిగిన మహారాష్ట్ర గేమ్‌.. వన్‌సెడైడ్‌గా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, గవర్నర్ల విషయంలో గతంలో కాంగ్రెస్‌ చేసిన తప్పులే బీజేపీ చేస్తోందని విమర్శించారు లోక్‌సత్తా నేత జయప్రకాష్‌ నారాయణ. ఐదేళ్ల సుస్థిర ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నట్లు ప్రజల ముందు వాగ్దానం చేసి, ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందిన తరువాత విడిపోవడం అనేది చాల పెద్ద తప్పుగా భావించాలి. ఈ విషయంలో బిజెపి హుందాగా వ్యవహరించలేదు. ఇంకా మరిన్ని విషయాలు మహా రాజకీయాల గురించి ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..