మీ ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా..? అయితే ఇప్పుడు పొందడం చాలా ఈజీ..

ఆధార్.. దేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి దాదాపు ఉన్న కార్డు ఇది. అయితే దీనికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఛేంజ్ అవుతూనే ఉన్నాయి. ఒక్క ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఎన్ని ఉపయోగాలు చెప్పక్కర్లేదు. అయితే ఈ కార్డులో మార్పులు చేర్పులు చేయాలంటే.. కొద్దిగా ఇబ్బంది పడాల్సిందే. ఇక ఈ కార్డు ఒకవేళ పోగొట్టుకుంటే.. ఇక ఆధార్ ఎన్‌రోల్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిందే. ఒకవేళ ఆధార్‌కి సంబంధించిన జిరాక్స్ కాపీ ఉన్నా.. లేదా ఆధార్ నంబర్ గుర్తు […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:42 pm, Tue, 26 November 19
మీ ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా..? అయితే ఇప్పుడు పొందడం చాలా ఈజీ..

ఆధార్.. దేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి దాదాపు ఉన్న కార్డు ఇది. అయితే దీనికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఛేంజ్ అవుతూనే ఉన్నాయి. ఒక్క ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఎన్ని ఉపయోగాలు చెప్పక్కర్లేదు. అయితే ఈ కార్డులో మార్పులు చేర్పులు చేయాలంటే.. కొద్దిగా ఇబ్బంది పడాల్సిందే. ఇక ఈ కార్డు ఒకవేళ పోగొట్టుకుంటే.. ఇక ఆధార్ ఎన్‌రోల్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిందే. ఒకవేళ ఆధార్‌కి సంబంధించిన జిరాక్స్ కాపీ ఉన్నా.. లేదా ఆధార్ నంబర్ గుర్తు ఉన్నా.. దానిని ఆధార్ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే వెసులు బాటు ఉండేది. అయితే ఈ ఆధార్ కార్డును ఇక డిజిటల్ రూపంలో ఉపయోగించేందుకు వీలుగా యూఐడీఏఐ డెవలప్ చేసింది.

ఆధార్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరికోసం.. ఇప్పుడు యూఐడీఏఐ ఎం-ఆధార్‌ యాప్‌ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ ఫోన్ ఉపయోగిస్తున్న యూజర్లకు ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇంతకు ముందు ఎం-ఆధార్ యాప్ ఉంటే.. దానిని అన్ ఇన్‌స్టాల్ చేసి.. తిరిగి కొత్త యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. అయితే వెరిఫై కోసం మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఈ ఈ కొత్త యాప్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి.

M- ఆధార్ యాప్ ఫీచర్లు…

ఈ యాప్‌‌ను 13 భాషల్లో ఉపయోగించవచ్చు..( ఇంగ్లీష్‌తో..)
ఆధార్ కార్డు ఉన్నవాళ్లే కాదు.. లేని వాళ్లు కూడా దీనిని ఉపయోగించవచ్చు.
ఆధార్ కార్డు పాడైపోతే.. తిరిగి ఈ యాప్‌లో రెక్వెస్ట్ పెట్టుకుంటే.. మళ్లీ పొందవచ్చు.
అంతేకాదు.. ఒకవేళ పొరపాటున ఆధార్ కార్డు మిస్స్ అయితే కూడా.. ఈ యాప్ ద్వారా మళ్లీ పొందవచ్చు
మళ్లీ కార్డు పొందాలంటే.. యాప్‌లో రీ ప్రింట్ కోసం రిక్వెస్ట్ పెట్టాలి. (ఇందుకు గాను రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.)
అంతేకాదు.. యాప్‌లోని ప్రతి సెక్షన్లలో అనేక లేటెస్ట్ సౌకర్యాలు ఉన్నాయి.
ఈ యాప్‌లో సమీప ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ గుర్తించవచ్చు.
ఈ యాప్ కేవలం ఇంటర్నెట్ ఉన్న సమయంలోనే పనిచేస్తుంది. ( ఆఫ్‌లైన్‌లో పనిచేయదు)
ఇక మరో అత్యంత కీ ఫీచర్ ఏంటంటే.. రైళ్లలో ప్రయాణించేటప్పుడు.. ఈ M-ఆధార్ యాప్ ద్వారా ఐడీ ప్రూఫ్‌ను చూపించొచ్చు.