ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లిన బస్సు!

చండీగఢ్ లో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసును కోచింగ్ సెంటర్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారులు, బాటసారులు ఆయన్ని రక్షించి ఆసుపత్రిలో చేర్చారు. ఆ పోలీసును రక్షించడానికి వచ్చిన బాటసారులను ప్రజలు ప్రశంసించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాత్రి 8.12 గంటలకు కాశీ బారి లైట్ పాయింట్ వద్ద కుల్దీప్ సింగ్ ట్రాఫిక్ మార్గనిర్దేశం చేస్తున్నప్పుడు ఓ బస్సు అకస్మాత్తుగా ఆయన్ను ఢీకొట్టింది. […]

ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లిన బస్సు!
Follow us

| Edited By:

Updated on: Nov 27, 2019 | 12:04 AM

చండీగఢ్ లో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసును కోచింగ్ సెంటర్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారులు, బాటసారులు ఆయన్ని రక్షించి ఆసుపత్రిలో చేర్చారు. ఆ పోలీసును రక్షించడానికి వచ్చిన బాటసారులను ప్రజలు ప్రశంసించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాత్రి 8.12 గంటలకు కాశీ బారి లైట్ పాయింట్ వద్ద కుల్దీప్ సింగ్ ట్రాఫిక్ మార్గనిర్దేశం చేస్తున్నప్పుడు ఓ బస్సు అకస్మాత్తుగా ఆయన్ను ఢీకొట్టింది. అతడు రోడ్డు మీద ఎగిరి పడ్డాడు. గాయపడిన పోలీసు వైపు నలుగురు వ్యక్తులు పరుగెత్తటం వీడియోలో ఉంది.

“అతనికి సహాయమ చేయటానికి వచ్చిన ప్రజలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని చండీగఢ్ పోలీసులు తెలిపారు. తరువాత సెక్టార్ 32 ఆసుపత్రిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. బస్సు డ్రైవర్‌ను వెంటనే అరెస్టు చేశారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని సెక్షన్ 279 మరియు 337 కింద రాష్ డ్రైవింగ్గా చేసినట్లు డ్రైవర్‌పై అభియోగాలు మోపారు.

[svt-event date=”26/11/2019,11:47PM” class=”svt-cd-green” ]

[/svt-event]