కాటసాని రామిరెడ్డి వర్సెస్ జనార్థన రెడ్డి : ‘నువ్వు భూ కబ్జాదారుడివి… కాదు నువ్వే, కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్‌వి… నేనొప్పుడో మానేశా’

ఒకరు కత్తి పట్టుకొని యుద్ధ రంగంలోకి దిగుతానంటే... మరొకరు అంత సీన్‌ లేదంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే..

కాటసాని రామిరెడ్డి వర్సెస్ జనార్థన రెడ్డి : 'నువ్వు భూ కబ్జాదారుడివి... కాదు నువ్వే, కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్‌వి... నేనొప్పుడో మానేశా'
Follow us

|

Updated on: Jan 24, 2021 | 11:49 AM

ఒకరు కత్తి పట్టుకొని యుద్ధ రంగంలోకి దిగుతానంటే… మరొకరు అంత సీన్‌ లేదంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మధ్య మొదలైన మాటల యుద్ధం… ఇప్పుడు పీక్స్‌కు చేరింది. పంచాయతీ ఎన్నికల వివాదం ఏ టర్న్‌ తీసుకుంటుందని టోటల్‌ ఆంధ్రప్రదేశ్‌ టెన్షన్‌తో ఎదురు చూస్తుంటే… కర్నూలు జిల్లా బనగానపల్లె మాత్రం ఈ ఇద్దరి లీడర్స్‌పై ఫోకస్‌ పెట్టింది. ఇంతకీ బనగానపల్లిలో ఏం జరుగుతోందన్న విషయానొకొస్తే, అత్యంత ఫ్యాక్షన్‌ ప్రభావిత ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా బనగానపల్లెలో నేతల పవర్‌ఫుల్‌ కామెంట్స్‌తో పొలిటికల్ హీట్ పెరిగింది. నెల రోజుల నుంచి వీళ్లిద్దరి మధ్య మాటల టపాసులు పేలుతున్నాయి. తేల్చుకుందాం రా అంటున్న వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మాటలతో బనగానపల్లెల్లో టెన్షన్‌ మొదలైంది. కత్తి పట్టి బరిలో దిగేందుకు సిద్ధమని జనార్దన్‌ అంటే… అది నీకు సూట్‌ కాదంటున్నారు కాటసాని. ఇద్దరికీ అంగబలం, అర్థ బలం పుష్కలంగా ఉన్న నాయకులే కావడంతో ఎప్పుడు ఏం జరుగుతోందో అన్న భయం స్థానికులతోపాటు, అటు పోలీసుల్లోనూ నెలకొంది.

నువ్వు కరుడుగట్టిన భూ కబ్జాదారుడివి… కాదు నువ్వే.. 22 భూకబ్జా కేసుల్లో నిందితుడివి… నువ్వు కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్‌వి… నేనొప్పుడో ఫ్యాక్షన్‌ రాజకీయాలు మానేశా… నీది అక్రమ మైనింగ్‌ వ్యాపారం… నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఇలా బహిరంగంగానే తిట్టిపోసుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి. బనగానపల్లెలో వీరిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. గతంలో కాటసాని రాంరెడ్డిపై గెలిచారు బీసీ జనార్దన్‌రెడ్డి. ఇప్పుడు బీసీ జనార్దన్‌రెడ్డిపై గెలిచారు కాటసాని రాంరెడ్డి. వీరి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కర్నూలు జిల్లాలో కామన్‌. వివిధ విషయాల్లో పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారు. ఎమ్మెల్యే భూ కబ్జాదారుడు, కమీషన్లకు మారుపేరు, మైనింగ్‌ డాన్‌ అంటూ నడిరోడ్డుపై ధర్నాకు దిగారు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి. జనజీవనానికి ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదైంది.

ఇప్పుడు ఈ కేసుల ఇష్యూతో మరోసారి బనగానపల్లెలో అగ్గి రాజుకుంది. ఎస్సీఎస్టీ కేసులు పెట్టడంపై జనార్దన్‌రెడ్డి వర్గీయులు ఫైర్‌ అవుతున్నారు. గత నెల రోజులుగా చేస్తున్న విమర్శలకు కౌంటర్‌ ఎటాక్‌ చేశారు అధికార పార్టీ ఎమ్మెల్యే కాటసాని. ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. జనార్దన్‌రెడ్డిపై పెట్టిన కేసుల్లో ఒకటి ఎస్సీఎస్టీ కేసు. ఈ కేసులకు సంబంధించి జనార్ధన్ రెడ్డిని అరెస్టు చేస్తారంటూ 2 రోజులుగా హైటెన్షన్ నెలకొంది. ఈ కేసులో ఆయనే లొంగిపోతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఒకవేళ అరెస్టు చేస్తే రియాక్షన్‌ ఎలా ఉంటుందో అని పోలీసులు హైరానా పడుతున్నారు. అందుకే భారీ ఎత్తున పోలీసు బలగాలను మొబలైజ్‌ చేశారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా అరెస్ట్ చేసిన భయపడేది లేదంటున్నారు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి. జనార్ధన్‌ రెడ్డి ఆరోపణలపై బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూడా ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. రోడ్డుకు అడ్డంగా కూర్చుని ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తే కేసు పెట్టక… ముద్దు పెట్టుకుంటారా అంటూ సెటైర్లు పేల్చారు. పోలీసులు పెట్టే కేసులు తనకేం సంబంధమని క్వచన్ చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే. ఇక, స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది… ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సాగుతున్న మాటల దాడి… పల్లెపోరును మరింత రాజేసేట్టు ఉంది.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..