AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 ఓవర్లు.. 180 పరుగులు.. టీ20 చరిత్రలోనే చెత్త రికార్డులో టీమిండియా తోపు..!

IND vs NZ T20I: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను భారత్ 3-2తో గెలుచుకున్నా.. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు మాత్రం ఈ సిరీస్ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసిన భువీ.. టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో ఓ బౌలర్‌కు నమోదైన అత్యంత చెత్త బౌలింగ్ సగటును తన ఖాతాలో వేసుకున్నాడు.

16 ఓవర్లు.. 180 పరుగులు.. టీ20 చరిత్రలోనే చెత్త రికార్డులో టీమిండియా తోపు..!
Bhuvneshwar Kumar Records
Venkata Chari
|

Updated on: Nov 01, 2026 | 6:05 PM

Share

IND vs NZ T20I: న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 3-2తో సొంతం చేసుకుంది. అయితే భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) మాత్రం ఈ సిరీస్‌ను నిరాశతో ముగించాడు. నాలుగేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ టీ20ల్లోకి తిరిగి వచ్చిన భువీ.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

నాలుగు మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు. 16 ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 180 పరుగులు సమర్పించుకున్నాడు. అతడి ఎకానమీ 11.25గా నమోదైంది. ముఖ్యంగా అతడి బౌలింగ్ సగటు ఏకంగా 180.00గా ఉండటం ఆందోళన కలిగించే విషయం.

ఇది టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో ఏ బౌలర్‌కైనా నమోదైన అత్యంత చెత్త సగటుగా నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ (Kyle Jamieson) పేరిట ఉంది. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో జేమీసన్ 175.00 సగటుతో బౌలింగ్ చేశాడు. ఇప్పుడు భువనేశ్వర్ ఆ రికార్డును అధిగమించాడు.

తొలి మ్యాచ్‌లోనే భారీగా పరుగులు..

సిరీస్‌లో తొలి టీ20లో భువనేశ్వర్ నాలుగు ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇది అతడి కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది.

రెండో టీ20లో ఒక్క వికెట్ తీసుకున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. నాలుగు ఓవర్లలో 50 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తీసుకున్న వికెట్‌నే మొత్తం సిరీస్‌లో అతడికి దక్కిన ఏకైక వికెట్.

మూడో టీ20లోనూ భువీకి భారీ దెబ్బే తగిలింది. నాలుగు ఓవర్లలో 40 పరుగులు ఇచ్చాడు. దీంతో నాలుగో మ్యాచ్‌లో అతడిని తుది జట్టు నుంచి తప్పించారు.

అయితే చివరి టీ20లో మరోసారి అవకాశం లభించింది. ఈ మ్యాచ్‌లోనూ భువనేశ్వర్ తన ప్రభావం చూపలేకపోయాడు. నాలుగు ఓవర్లలో 41 పరుగులు ఇచ్చాడు. దీంతో మొత్తం సిరీస్‌లో అతడి గణాంకాలు 1/180గా మారాయి.

న్యూజిలాండ్‌లో మరింత దిగజారిన రికార్డు..

ఈ సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌లో భువనేశ్వర్ ఐదు టీ20లు ఆడాడు. 19 ఓవర్లలో 160 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అక్కడ అతడి ఎకానమీ 8.40గా ఉంది. ఏ దేశంలోనూ లేనంత ఎక్కువ ఎకానమీ న్యూజిలాండ్‌లోనే ఉండటం గమనార్హం.

అప్పటివరకు న్యూజిలాండ్‌లో భువీ బౌలింగ్ సగటు 40.00గా ఉండేది. ఈ సిరీస్ తర్వాత అది ఏకంగా 68కి పెరిగింది. స్ట్రైక్‌రేట్ కూడా 42కి చేరింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ సిరీస్ భువనేశ్వర్ అంతర్జాతీయ పునరాగమనంపై తీవ్ర ప్రశ్నలు రేకెత్తించేలా చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
16 ఓవర్లు.. 180 పరుగులు.. టీ20 చరిత్రలోనే చెత్త రికార్డులో భువీ
16 ఓవర్లు.. 180 పరుగులు.. టీ20 చరిత్రలోనే చెత్త రికార్డులో భువీ
సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జెన్ జీ బాబా’.. బాబా లుక్స్‌కు ఫిదా!
సోషల్ మీడియాను ఊపేస్తున్న ‘జెన్ జీ బాబా’.. బాబా లుక్స్‌కు ఫిదా!
నాకు కాబోయే వాడికి డబ్బులు లేకున్నా ఒకే.. అదొక్కటి ఉంటే చాలు
నాకు కాబోయే వాడికి డబ్బులు లేకున్నా ఒకే.. అదొక్కటి ఉంటే చాలు
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
నవంబర్‌లో రాబోయే ఎలక్ట్రిక్‌ కార్లు..సింగిల్‌ ఛార్జ్‌పై 715 కి.మీ
నవంబర్‌లో రాబోయే ఎలక్ట్రిక్‌ కార్లు..సింగిల్‌ ఛార్జ్‌పై 715 కి.మీ
శ్రేయస్ అయ్యర్‌ను సర్పంచ్ సాబ్ అని ఎందుకు అంటారు..?
శ్రేయస్ అయ్యర్‌ను సర్పంచ్ సాబ్ అని ఎందుకు అంటారు..?
రాత్రి పడుకునే ముందు.. సింపుల్ 3-స్టెప్ నైట్ స్కిన్ కేర్ రొటీన్!
రాత్రి పడుకునే ముందు.. సింపుల్ 3-స్టెప్ నైట్ స్కిన్ కేర్ రొటీన్!
Video:పెళ్లికి బంధువులు లేరు.. సోషల్ మీడియాలో పిలిస్తే వేలల్లో..!
Video:పెళ్లికి బంధువులు లేరు.. సోషల్ మీడియాలో పిలిస్తే వేలల్లో..!
కత్తెర మొద్దుబారిందా? ఈ చిన్న ట్రిక్‌తో మళ్లీ పదునుగా మార్చండి!
కత్తెర మొద్దుబారిందా? ఈ చిన్న ట్రిక్‌తో మళ్లీ పదునుగా మార్చండి!
గ్యాస్‌ అయిపోయి సిలిండర్‌కు డబ్బులు లేవా? అయితే EMIలో కట్టొచ్చు..
గ్యాస్‌ అయిపోయి సిలిండర్‌కు డబ్బులు లేవా? అయితే EMIలో కట్టొచ్చు..