‘భీష్మ’ సినిమాపై నితిన్ భావోద్వేగం!

‘భీష్మ’ సినిమాపై టాలీవుడ్ హీరో నితిన్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇదే విషయంపై ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ”భీష్మ’ సినిమా షూటింగ్ అప్పుడే ముగియడం తనకు చాలా బాధ కలిగించిందని, అదే సమయంలో ఓ మంచి చిత్రంలో నటించినందుకు గర్వంగా కూడా అనిపించిందని’ ట్వీట్‌లో పేర్కొన్నాడు నితిన్. ఈ సినిమాతో నాకు చాలా హ్యాపీ మూమెంట్స్ దొరికాయని, త్వరలో అందరం మళ్లీ కలిసి పనిచేద్దామని కూడా అన్నారు. కాగా భీష్మ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం […]

'భీష్మ' సినిమాపై నితిన్ భావోద్వేగం!

‘భీష్మ’ సినిమాపై టాలీవుడ్ హీరో నితిన్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇదే విషయంపై ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ”భీష్మ’ సినిమా షూటింగ్ అప్పుడే ముగియడం తనకు చాలా బాధ కలిగించిందని, అదే సమయంలో ఓ మంచి చిత్రంలో నటించినందుకు గర్వంగా కూడా అనిపించిందని’ ట్వీట్‌లో పేర్కొన్నాడు నితిన్. ఈ సినిమాతో నాకు చాలా హ్యాపీ మూమెంట్స్ దొరికాయని, త్వరలో అందరం మళ్లీ కలిసి పనిచేద్దామని కూడా అన్నారు.

కాగా భీష్మ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వంశీ నిర్మించారు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా నటించింది. మణిశర్మ తనయుడు మహతి సర్వసాగర్ సంగీతమందించారు. మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ ఈ చిత్రం.

Published On - 11:59 am, Sun, 2 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu