‘బీసీల సంక్రాంతి’ పేరిట వేడుకలు.. 56 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల చేత ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రి

బీసీల సంక్రాంతి పేరిట విజయవాడలో ఏపీ సర్కారు వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ప్రకటించిన 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు..

'బీసీల సంక్రాంతి' పేరిట వేడుకలు.. 56 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల చేత ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రి


బీసీల సంక్రాంతి పేరిట విజయవాడలో ఏపీ సర్కారు వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ప్రకటించిన 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇందిరాగాంధీ స్టేడియంలో పెద్దయెత్తున నిర్వహిస్తోన్న ఈ సభలో మంత్రి వేణుగోపాలకృష్ణ.. చైర్మన్లు, డైరెక్టర్లతో ప్రమాణం చేయించారు. బీసీలు డెవలప్‌ అయ్యేందుకు సీఎం జగన్‌ చాలా అవకాశాలు ఇస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్, ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తదితర వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు.  అనంతరం సభలో మరింత మంది వక్తలు మాట్లాడుతున్నారు..  కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఈ దిగువున..