AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇదెక్కడి విచిత్రమైన స్టెప్పులు.. లైవ్ మ్యాచ్‌లో నోరు వెళ్లబెట్టి, రెండు చేతులతో ఇలా..

Taskin Ahmed Celebration Video: మైదానంలో టాస్కిన్ అహ్మద్ చేసిన ఈ సరదా విన్యాసం నెటిజన్లను ఎంతగానో అలరిస్తోంది. బంగ్లాదేశ్ పేసర్ల ధాటికి ఆస్ట్రేలియా అగ్రశ్రేణి బ్యాటర్లు తలవంచక తప్పలేదు. ఈ తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఇదే వేగాన్ని కొనసాగించి విజయం సాధిస్తుందో లేదో చూడాలి.

Video: ఇదెక్కడి విచిత్రమైన స్టెప్పులు.. లైవ్ మ్యాచ్‌లో నోరు వెళ్లబెట్టి, రెండు చేతులతో ఇలా..
Taskin Ahmed Bizarre Celebration Goes Viral
Venkata Chari
|

Updated on: Aug 13, 2026 | 10:45 AM

Share

Taskin Ahmed Celebration Video: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్టులో బంగ్లాదేశ్ పేసర్ టాస్కిన్ అహ్మద్ సంచలన వికెట్ తో మెరిశాడు. డేంజరస్ ఆల్‌రౌండర్ కామరాన్ గ్రీన్ ను పెవిలియన్ కు పంపి, ఆ తర్వాత అతను చేసిన వింత సెలబ్రేషన్ మైదానాన్ని ఊపేసింది. ఈ విచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న మొదటి టెస్టు తొలి రోజే తీవ్ర ఉత్కంఠకు తెరలేచింది. డార్విన్ పిచ్ పై మంచి ఊపులో కనిపిస్తున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామరాన్ గ్రీన్ ను అవుట్ చేసిన తర్వాత టాస్కిన్ అహ్మద్ చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్నింగ్స్ 22వ ఓవర్ లో టాస్కిన్ వేసిన బంతిని గ్రీన్ లెగ్ సైడ్ వైపు తిప్పడానికి ప్రయత్నించాడు. అయితే బంతి సరిగ్గా బ్యాట్ కు తగలకుండా గాల్లోకి లేచింది. మిడ్ వికెట్ లో ఉన్న సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ దాన్ని అద్భుతమైన క్యాచ్ గా మలుచుకున్నాడు. గ్రీన్ అవుట్ కాగానే టాస్కిన్ తన నాలుక బయటకు పెట్టి విచిత్రంగా డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. మిగతా ఆటగాళ్లంతా రహీమ్ వైపు పరుగెత్తగా, టాస్కిన్ మాత్రం ఒంటరిగా చేసిన ఈ సరదా డ్యాన్స్ కెమెరాలో రికార్డై క్షణాల్లో వైరల్ గా మారింది.

ఆసీస్ జట్టుకు బంగ్లా పేసర్ల షాక్..

టాస్ తో పాటు బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కు తొలి సెషన్ లోనే బంగ్లాదేశ్ పేసర్లు ఊహించని షాక్ ఇచ్చారు. పచ్చిక ఉన్న పిచ్ వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకుని హసన్ మహమూద్, టాస్కిన్ అహ్మద్, ఎబాదత్ హుస్సేన్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డారు. ఎలాంటి నష్టం లేకుండా 45 పరుగులు చేసిన ఆస్ట్రేలియాను ఒక్కసారిగా కష్టాల్లోకి నెట్టారు. హసన్ మహమూద్ వరుస ఓవర్లలో వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. లోకల్ హీరో జేక్ వెదర్‌ఆల్డ్ ను 23 పరుగుల వద్ద పెవిలియన్ పంపిన హసన్, ఆ మరుసటి ఓవర్ లోనే విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 52 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది.

ఇవి కూడా చదవండి

లంచ్ సమయానికి కష్టాల్లో ఆస్ట్రేలియా..

పేసర్ ఎబాదత్ హుస్సేన్ కూడా తన పదునైన బంతులతో విరుచుకుపడ్డాడు. మార్నస్ లబుషేన్ ను బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో చేతికి క్యాచ్ ఇచ్చేలా చేసి అవుట్ చేశాడు. స్లిప్ లో ఒక సులువైన క్యాచ్ చేజారకపోతే స్టీవ్ స్మిత్ కూడా త్వరగానే వెనుతిరిగేవాడు. ఇక లంచ్ విరామానికి సరిగ్గా ముందు టాస్కిన్ అహ్మద్ విసిరిన బంతికి గ్రీన్ అవుట్ కావడంతో ఆస్ట్రేలియా 74 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తడబడింది. 2003 తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు ఆడుతున్న బంగ్లాదేశ్, మొదటి రోజే ఇలా ఆధిపత్యం చెలాయించడం క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

బిజీ షెడ్యూల్ ముందు ఆసీస్ కు పెద్ద పరీక్ష..

ప్రస్తుతం వార్త రాసే సమయానికి ఆస్ట్రేలియా టీం 8 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 67 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దాదాపు 13 నెలల తర్వాత రెండో టెస్టు మాత్రమే ఆడుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తో పాటు మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ వంటి అగ్రశ్రేణి పేసర్లు తుది జట్టులో ఉన్నారు. వీరికి తోడుగా సీనియర్ స్పిన్నర్ నాథన్ లయన్, ఆల్‌రౌండర్లు గ్రీన్, బో వెబ్‌స్టర్ ఉన్నారు. రాబోయే 12 నెలల కాలంలో ఏకంగా 20 టెస్టులు ఆడాల్సి ఉన్న ఆస్ట్రేలియాకు ఈ “టాప్ ఎండ్” సిరీస్ ఆరంభంలోనే బంగ్లాదేశ్ నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us