మా దేశంపై దాడి చేయండంటున్న పాక్ వేర్పాటువాద సంస్థ

వాషింగ్టన్‌ : పుల్వమా దాడికి ప్రతీకారంగా భారత దళాలు తమ మాతృదేశమైన పాక్‌పై దాడి చేయాలని అమెరికాలోని పాక్‌ వేర్పాటువాద సంస్థ బలూచిస్థాన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ భారత్‌కు విజ్ఞప్తి చేసింది. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై జరిగిన దాడిని ఖండించింది. మోదీ సర్కారు పాక్‌ ప్రభుత్వంతో అన్ని రకాలు సంబంధాలను తెంచుకోవాలని బీఎన్సీ కోరింది. పాక్‌పై యుద్ధం ప్రకటించి ముష్కరులను న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని కోరారు. మానవాళికి పాక్‌ పెనుముప్పుగా మారిందని విమర్శించింది. బలూచిస్థాన్‌ ప్రజలు […]

మా దేశంపై దాడి చేయండంటున్న పాక్ వేర్పాటువాద సంస్థ

Edited By:

Updated on: Mar 07, 2019 | 7:38 PM

వాషింగ్టన్‌ : పుల్వమా దాడికి ప్రతీకారంగా భారత దళాలు తమ మాతృదేశమైన పాక్‌పై దాడి చేయాలని అమెరికాలోని పాక్‌ వేర్పాటువాద సంస్థ బలూచిస్థాన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ భారత్‌కు విజ్ఞప్తి చేసింది. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై జరిగిన దాడిని ఖండించింది. మోదీ సర్కారు పాక్‌ ప్రభుత్వంతో అన్ని రకాలు సంబంధాలను తెంచుకోవాలని బీఎన్సీ కోరింది. పాక్‌పై యుద్ధం ప్రకటించి ముష్కరులను న్యాయస్థానం ముందుకు తీసుకువచ్చేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని కోరారు. మానవాళికి పాక్‌ పెనుముప్పుగా మారిందని విమర్శించింది. బలూచిస్థాన్‌ ప్రజలు సుదీర్ఘకాలంగా స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్నారు. అయితే పాక్‌ ప్రభుత్వం దమననీతిలో వారిని అణచివేస్తోంది. పాక్‌ సైనికుల దురాగతాలకు భయపడిన వేలాదిమంది బలూచీ ప్రజలు ఇతర దేశాలకు వలసవెళ్లారు. ప్రవాసంలో ఉంటున్న బలూచీనేత ఖాన్‌ కలాత్‌ నేతృత్వంలో ప్రవాసంలో బలూచీ ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు భారత్‌ చేయూతనివ్వాలని బీఎన్‌సీ కోరింది.