AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆధార్ సేఫ్టీకి కొత్త ఫీచర్.. ఇలా చేస్తే సరి..

ఆధార్ ఇప్పుడు ఏ పని కావాలన్నా ఆధార్ తోనే ముడిపడి ఉంది. బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలన్నా.. పాన్ కార్డ్ తీసుకోవాలన్నా.. మొబైల్ తీసుకోవాలన్నా.. అన్నిటికి ఆధార్ నెంబరే ఆధారం. ఆధార్ లేనిదే ఏ పని జరగదు. అందుకే ఆధార్‌ను పుట్టిన పిల్లవాడి నుంచి ముసలివారు దాకా అందరూ తీసుకుంటున్నారు. అయితే ఆధార్ భద్రత పై అనేక అనుమానాలు ఉన్నాయి. ఆధార్ వివరాలను చాలా సులభంగా దొంగతనం చేసి దుర్వినియోగాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. దీంతో భద్రత గురించి […]

ఆధార్ సేఫ్టీకి కొత్త ఫీచర్.. ఇలా చేస్తే సరి..
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 09, 2019 | 9:09 AM

Share

ఆధార్ ఇప్పుడు ఏ పని కావాలన్నా ఆధార్ తోనే ముడిపడి ఉంది. బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలన్నా.. పాన్ కార్డ్ తీసుకోవాలన్నా.. మొబైల్ తీసుకోవాలన్నా.. అన్నిటికి ఆధార్ నెంబరే ఆధారం. ఆధార్ లేనిదే ఏ పని జరగదు. అందుకే ఆధార్‌ను పుట్టిన పిల్లవాడి నుంచి ముసలివారు దాకా అందరూ తీసుకుంటున్నారు. అయితే ఆధార్ భద్రత పై అనేక అనుమానాలు ఉన్నాయి. ఆధార్ వివరాలను చాలా సులభంగా దొంగతనం చేసి దుర్వినియోగాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. దీంతో భద్రత గురించి అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇకపై అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) చెబుతోంది. ఆధార్ నంబర్‌ను లాక్, అన్ లాక్ చేసుకునే కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక వ్యక్తి తన ఆధార్‌ నంబర్‌ను లాక్ చేసుకోవడం వల్ల ఇతరులు కనిపెట్టలేరు. అయితే ఒక్కసారి లాక్ చేసిన తర్వాత మరే ఇతర అవసరాలకు ఉపయోగించలేదు. మరలా అన్ లాక్ చేసి యూజ్ చేసుకోవచ్చు.

ముందుగా ఆధార్ నంబర్‌ను లాక్ చేసేముందు వర్చువల్ ఐడీని జనరేట్ చేసుకోవాలి. తరువాత యూఐడీఏఐ వెబ్‌సైట్ నుండి లేదా ఎస్ఎంఎస్ ద్వారా వర్చువల్ ఐడీని క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే www.uidai.gov.in లోకి వెళ్తే సరిపోతుంది. ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోతే లేదా యూఐడీఏఐ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేకపోతే SMS ద్వారా ఆధార్ నంబర్‌ను లాక్ లేదా అన్‌లాక్ చేయొచ్చు. మొబైల్ నంబర్ నుంచి 1947 కు SMS పంపడం ద్వారా కూడా ఆధార్ నంబర్‌ను లాక్ / అన్‌లాక్ చేసుకోవచ్చు.

ఆధార్ లాక్ చేయడం కోసం :

రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 1947కి ఎస్ఎంఎస్ పంపాలి. GETOTP అని టైప్ చేసి ఆధార్ నెంబర్ చివరి నాలుగు అంకెలను జోడించి UIDAIకి SMS పంపాలి. UIDAI నుంచి ఓటీపీ SMS ద్వారా వస్తుంది. ఓటీపీ వచ్చాక LOCKUID అని టైప్ చేసి ఆధార్ నెంబర్ లోని చివరి నాలుగు డిజిట్స్‌తో పాటు ఓటీపీని SMS చేయాలి. SMS చేరిన వెంటనే UIDAI ఆధార్ నెంబర్‌ని లాక్ చేస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి కన్ ఫర్మేషన్ SMS వస్తుంది.

ఆధార్ అన్ లాక్ చేయడం కోసం:

రిజిస్టర్డ్ మొబైల్ నుంచి 1947కి SMS చేయాలి. GETOTP అని టైప్ చేసి ఆరు అంకెల వర్చువల్ ఐడీ నెంబర్ జోడించి ఎస్ఎంఎస్ పంపాలి. UIDAI నుంచి వెంటనే ఆరు అంకెల ఓటీపీ SMS ద్వారా వస్తుంది. UNLOCKUID అని టైప్ చేసిన ఆరు అంకెల వర్చువల్ ఐడీ నెంబర్ టైప్ చేసి, దానితోపాటు ఓటీపీని జతచేసి SMS పంపాలి. రెండో ఎస్ఎంఎస్ వచ్చిన వెంటనే UIDAI ఆధార్ నెంబర్‌ని అన్ లాక్ చేస్తారు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి కన్ఫర్మేషన్ మేసేజ్ వస్తుంది.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..