AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి బెస్ట్ బ్యాట్స్‌మెన్ అనిపించుకున్న ఆసీస్ మాజీ సారధి.. స్టీవ్ స్మిత్ ఖాతాలో అరుదైన రికార్డు..

తాను అంతర్జాతీయ క్రికెట్‌లో బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని మరోసారి చాటి చెబుతూ రెండు సెంచరీలు బాదేశాడు. అంతేకాకుండా టీమిండియాపై అరుదైన రికార్డును

మరోసారి బెస్ట్ బ్యాట్స్‌మెన్ అనిపించుకున్న ఆసీస్ మాజీ సారధి.. స్టీవ్ స్మిత్ ఖాతాలో అరుదైన రికార్డు..
Ravi Kiran
|

Updated on: Nov 30, 2020 | 7:06 PM

Share

Steve Smith Record: స్లెడ్జింగ్‌కు మారుపేరు అయిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్.. ఆ చర్యకు బాగా హార్ట్ అయినట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న సిరీస్‌కు ముందు టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్.. స్టీవ్ స్మిత్, మాక్స్‌వెల్ ఆటతీరు‌పై పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనకు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఉన్న స్ట్రైక్ రేట్‌ను వన్డేల్లో స్టీవ్ స్మిత్ మెయింటైన్ చేస్తున్నాడని.. అలాగే ఐపీఎల్‌లో మాక్స్‌వెల్ ఖరీదైన చీర్‌ లీడర్ అంటూ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. వాటికి సరైన సమాధానం చెబుతూ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మొదటి రెండు వన్డేల్లోనూ రెచ్చిపోయారు. ముఖ్యంగా స్టీవ్ స్మిత్, మాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఐపీఎల్‌లో ఆడిన మొత్తం మ్యాచ్‌ల్లో 108 పరుగులు చేసిన మ్యాక్సీ.. ఇక్కడ రెండు మ్యాచ్‌ల్లోనే ఆ కోటాను పూర్తి చేశాడు. ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

ఇక స్టీవ్ స్మిత్ విషయానికి వస్తే.. తాను అంతర్జాతీయ క్రికెట్‌లో బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని మరోసారి చాటి చెబుతూ రెండు సెంచరీలు బాదేశాడు. అంతేకాకుండా టీమిండియాపై అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో భారత్‌పై 5 అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా ఘనత అందుకున్నాడు. ఈ జాబితాలో ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ 6 శతకాలతో మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే పాంటింగ్‌కు ఆరు సెంచరీలు సాధించడానికి 59 మ్యాచ్‌లు పట్టగా.. స్టీవ్ స్మిత్ కేవలం 20 వన్డేల్లోనే ఈ ఫీట్(5 సెంచరీలు) అందుకున్నాడు.

Follow Us
వాళ్ళ ఐడియా మాములుగా లేదు.. ఏజెన్సీలో ఏం చేస్తున్నారో తెలుసా..?
వాళ్ళ ఐడియా మాములుగా లేదు.. ఏజెన్సీలో ఏం చేస్తున్నారో తెలుసా..?
39 మంది భార్యలు, 94 మంది పిల్లలు.. ఒకే ఇంట్లో 200 మంది..
39 మంది భార్యలు, 94 మంది పిల్లలు.. ఒకే ఇంట్లో 200 మంది..
సీజన్‌తో పనిలేదు..పేద,ధనిక అందరికీ అమృతఫలం! రోజూ రెండు తిన్నారంటే
సీజన్‌తో పనిలేదు..పేద,ధనిక అందరికీ అమృతఫలం! రోజూ రెండు తిన్నారంటే
నేడే TG20 వేలం.. సిరాజ్, తిలక్ వర్మపై అందరి కళ్లు!
నేడే TG20 వేలం.. సిరాజ్, తిలక్ వర్మపై అందరి కళ్లు!
భారతీయులకు బంపర్ ఆఫర్.. సరికొత్త వీసా విధానంతో ఆదేశం ఆహ్వానం..!
భారతీయులకు బంపర్ ఆఫర్.. సరికొత్త వీసా విధానంతో ఆదేశం ఆహ్వానం..!
తనకు అన్నం పెట్టిన వాళ్లకు ఇల్లు కొని వాళ్ల లైఫ్ సెట్ చేసిన హీరో
తనకు అన్నం పెట్టిన వాళ్లకు ఇల్లు కొని వాళ్ల లైఫ్ సెట్ చేసిన హీరో
చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా? ఈ చిట్కాలతో ఈజీగా బయటపడండి!
చేప ముల్లు గొంతులో ఇరుక్కుందా? ఈ చిట్కాలతో ఈజీగా బయటపడండి!
రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్.. దీన్ని కొట్టే మొనగాడు లేనేలేదు..
రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్.. దీన్ని కొట్టే మొనగాడు లేనేలేదు..
తల్లితో కలిసి లిఫ్ట్ దిగని చిన్నారి.. పొరపాటున క్లోజ్ బటన్ నొక్కి
తల్లితో కలిసి లిఫ్ట్ దిగని చిన్నారి.. పొరపాటున క్లోజ్ బటన్ నొక్కి
విపరీత వేడిని క్షణాల్లో తగ్గించే హెల్ది టిఫిన్..
విపరీత వేడిని క్షణాల్లో తగ్గించే హెల్ది టిఫిన్..