ముంబైలో ఇన్వెస్టర్లను నిండా ముంచిన ‘పోంజీ స్కీమ్’, రూ. 4.76 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్న ఈడీ.
ముంబైలోని ఓ సంస్థకు చెందిన రూ. 4.76 కోట్ల విలువైన స్థిర, చరాస్థులను ఈడీ స్వాధీనం చేసుకుంది. మనీ లాండరింగ్ చట్టం కింద వీటిని స్వాధీనం..

ముంబైలోని ఓ సంస్థకు చెందిన రూ. 4.76 కోట్ల విలువైన స్థిర, చరాస్థులను ఈడీ స్వాధీనం చేసుకుంది. మనీ లాండరింగ్ చట్టం కింద వీటిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ కేసును వీరు ‘పోంజీ స్కీం’ గా వ్యవహరిస్తున్నారు. ఎటాచ్ చేసుకున్న ఆస్తుల్లో ఫ్లాట్, సంస్థ కార్యాలయం, ఫిక్స్డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలన్స్ లు ఉన్నాయి. శ్రీ ఓం సాయినాథ్ కంస్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు రూపేష్ వర్మ అనే వ్యక్తి డైరెక్టర్ గా, మరికొంతమంది ఇతర డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారని, కార్ రెంట్ అండ్ రిసార్ట్ స్కీం పేరిట వీరు..తమ సంస్థలో పెట్టుబడులు పెడితే రెట్టింపు పెట్టుబడి వస్తుందంటూనమ్మబలికి దేశవ్యాప్తంగా అనేకమంది ఇన్వెస్టర్ల నుంచి భారీగా సొమ్ము సేకరించారని ఈడీ వెల్లడించింది. భారీ పెట్టుబడి తమకు తిరిగి వస్తుందని నమ్మిన చాలామంది ఇందులో ఇన్వెస్ట్ చేశారని, కానీ ఈ సంస్థ వారికి ఇఛ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో వారు పోలీసులను ఆశ్రయించారని తెలిసింది.
రూపేష్ వర్మ అతని సహచరులు ప్రజల, ఇన్వెస్టర్ల డబ్బును తమ సంస్థ పేరిట, తమ సన్నిహితుల పేరిట మళ్లించారని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.కాగా ఈ సంస్థ చేసిన ఫ్రాడ్ పై ఈడీ ఇంకా దర్యాప్తు కొనసాగిస్తోంది.