అసెంబ్లీ తొలిరోజే రాజధాని తరలింపు బిల్లు

| Edited By: Ram Naramaneni

Jan 17, 2020 | 9:06 PM

ఏపీ రాజధానిని వికేంద్రీకరించే దిశగా అడుగులు వేగంగా వేస్తున్న ముఖ్యమంత్రి జగన్… జనవరి 20న అసెంబ్లీ స్పెషల్ సెషన్ తొలి రోజునే అందుకోసం రూపొందించిన బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైపవర్ కమిటీ శని, ఆదివారాలలో తమ నివేదికను ముఖ్యమంత్రికి అంద జేస్తుందని తెలుస్తోంది. దానికి అనుగుణంగా జనవరి 20న ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. అందులో హైపవర్ కమిటీ నివేదికను లాంఛనంగా ఆమోదించి, దానికి అనుగుణంగా రూపొందించిన బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు […]

అసెంబ్లీ తొలిరోజే రాజధాని తరలింపు బిల్లు
Follow us on

ఏపీ రాజధానిని వికేంద్రీకరించే దిశగా అడుగులు వేగంగా వేస్తున్న ముఖ్యమంత్రి జగన్… జనవరి 20న అసెంబ్లీ స్పెషల్ సెషన్ తొలి రోజునే అందుకోసం రూపొందించిన బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైపవర్ కమిటీ శని, ఆదివారాలలో తమ నివేదికను ముఖ్యమంత్రికి అంద జేస్తుందని తెలుస్తోంది. దానికి అనుగుణంగా జనవరి 20న ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. అందులో హైపవర్ కమిటీ నివేదికను లాంఛనంగా ఆమోదించి, దానికి అనుగుణంగా రూపొందించిన బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

సచివాలయ తరలింపు దాదాపు కన్‌ఫర్మ్ అయినట్లు చెబుతున్నారు. దీనికి అనుగుణంగానే ఆరు ప్రధాన ప్రభుత్వ విభాగాల అధిపతులకు సీఎంఓ నుంచి కీలక ఆదేశాలు ఆల్ రెడీ వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈనెల 23 తర్వాత ఎప్పుడైనా విశాఖ నుంచి పరిపాలన సాగించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సీఎంఓ ఆరు ప్రభుత్వ విభాగాధిపతులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. విశాఖలో తమ తమ విభాగాల హెచ్.ఓ.డీ. ఆఫీసులను ఏర్పాటు చేసుకునేందుకు భవనాలను ఎంపిక చేసుకోవాలని చెప్పినట్లు సమాచారం.

రిపబ్లిక్ డే వేడుకలకు విశాఖలోని ఆర్కే బీచ్ ఏరియా సిద్దమవుతున్న సమయంలోనే దానికి సమాంతరంగా హెచ్.ఓ.డీ. భవనాల ఎంపిక కూడా జరుగుతుందని ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి ఆంతరంగిక భేటీలలో చెబుతున్నారు. ప్రధాన విభాగాల తరలింపు… ఆ తర్వాత రిపబ్లిక్ డే వేడుకలు.. మొత్తమ్మీద నెలాఖరుకు విశాఖ సచివాలయానికి సంబంధించి 60-70 శాతం పనులు విశాఖపట్నం నుంచి జరిగేలా కార్యాచరణ అమలవుతుందని అంటున్నారు.