అసోంలో రూ.25 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్

అసోంలో పెద్తఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. కబ్రి అంగ్లాంగ్ జిల్లాలో రూ. 25 కోట్ల విలువైన 5 కేజీల హెరాయిన్ పట్టుబడినట్టు డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా వెల్లడించారు.

అసోంలో రూ.25 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 28, 2020 | 4:15 PM

అసోంలో పెద్తఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఆ రాష్ట్రంలో డ్రగ్ స్మగ్లింగ్‌ను రూపుమాపేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. కబ్రి అంగ్లాంగ్ జిల్లాలో రూ. 25 కోట్ల విలువైన 5 కేజీల హెరాయిన్ పట్టుబడినట్టు డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా వెల్లడించారు. అసోంలో ఈ స్థాయిలో డ్రగ్స్​ పట్టుబడటం ఇదే తొలిసారని డీజీపీ పేర్కొన్నారు. వీటిని సరఫరా చేస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అసోం – నాగాలాండ్ సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమ రవాణా గుట్టరట్టైంది. కబ్రి అగ్లాంగ్ పోలీసులు గత రాత్రి అసోం నాగాలాండ్ సరిహద్దుల్లో 5 కిలోల హెరాయిన్ పట్టుకున్నారు. వారికి ప్రశంసలు. డ్రగ్స్ స్మగ్లర్లకు ఇది భారీ ఎదురుదెబ్బ…’’ అని డీజీపీ ట్వీట్ చేశారు. పట్టుబడిన నిందితుడిని ఇస్మాయిల్ అలీగా గుర్తించారు. అతడి నుంచి స్వాధీనం చేసుకున్న 5.05 కేజీల హెరాయిన్ మార్కెట్ లో దాని విలువ రూ.25 కోట్ల ధర పలుకుతుందని ఆయన తెలిపారు.