Tulip Garden: రా.. రమ్మంటున్న తులిప్ గార్డెన్.. సందర్శకులకు అనుమతి
మీరు ప్రకృతి ప్రేమికులైతే.. రంగురంగుల పూల తోటలను చూడడం ఇష్టమైతే.. మీకో గుడ్ న్యూస్. కాశ్మీర్ లోయలో ఉన్న అందమైన నగరం శ్రీనగర్ మరింత అందంగా మారిపోయింది. ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఈ ఏడాది కూడా సాధారణ ప్రజల సందర్శన కోసం ఓపెన్ చేశారు.

ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఈ తోట అందాన్ని ఆస్వాదించడానికి.. తులిప్ పండుగలో పాల్గొనడానికి ఇక్కడికి క్యూ కడుతుంటారు. శ్రీ నగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఇందిరా గాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్.. ప్రపంచంలోని అత్యంత అందమైన తోటల్లో ఒకటి. స్వర్గంలా కనిపించడమే కాదు.. భూతలం మీద ఇంద్రధనస్సులా కనిపిస్తూ వేలకొద్దీ రంగురంగుల తులిప్ పువ్వులు వికసిస్తాయి. మీరు ఈ సంవత్సరం మీ కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు సందర్శించే పర్యాటక ప్రాంతాల జాబితాలో తులిప్ గార్డెన్‌ను చేర్చుకోండి.
ఈ తోట ఆసియాలోనే అతిపెద్ద తులిప్ తోట, ఇది 30 హెక్టార్లలో విస్తరించి ఉంది. 17 లక్షలకు పైగా తులిప్ పువ్వులు, 75 కంటే ఎక్కువ రకాల తులిప్‌లను చూడవచ్చు. ఈ తోట దాల్ సరస్సు సమీపంలో ఉంది. ఇక్కడ నుంచి జబర్వాన్ కొండల అందమైన దృశ్యం కనిపిస్తుంది. చుట్టూ మంచు పర్వతాలు, తెల్లటి నురుగుతో పాల సంద్రంగా కనిపించే సరస్సు లాంటి చాలా అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి.
ప్రతి ఏటా మార్చి-ఏప్రిల్ నెలల్లో తులిప్ పండుగను నిర్వహిస్తారు. ఈ పండుగ సందర్భంగా పర్యాటకుల కోసం చాలా కార్యక్రమాలను నిర్వహిస్తారు. తులిప్ పువ్వులతో పాటు, ఎన్నో రకాల డాఫోడిల్స్, హైసింత్స్, నార్సిసస్ లాంటి చాలా రకాల ఇతర విదేశీ పువ్వులను ఇక్కడ చూడవచ్చు.
View this post on Instagram
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.