స్టార్క్ దెబ్బకు.. రూట్ విలవిల!

స్టార్క్ దెబ్బకు.. రూట్ విలవిల!

వేగంతో కూడిన పదునైన బంతులను విసరడంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ దిట్ట. యాషెస్ సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో స్టార్క్ 140 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతులకు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అబ్డామినల్ గార్డ్ (ఉదర రక్షక కవచం) రెండు ముక్కలైంది. నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పలుమార్లు స్టార్క్ విసిరిన బంతులు రూట్ సున్నిత భాగాలను తాకడంతో విలవిల్లాడాడు. ఇక అత్యంత వేగంగా వచ్చిన ఓ బంతి పొట్ట […]

Ravi Kiran

|

Sep 09, 2019 | 1:44 AM

వేగంతో కూడిన పదునైన బంతులను విసరడంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ దిట్ట. యాషెస్ సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో స్టార్క్ 140 కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతులకు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అబ్డామినల్ గార్డ్ (ఉదర రక్షక కవచం) రెండు ముక్కలైంది.

నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పలుమార్లు స్టార్క్ విసిరిన బంతులు రూట్ సున్నిత భాగాలను తాకడంతో విలవిల్లాడాడు. ఇక అత్యంత వేగంగా వచ్చిన ఓ బంతి పొట్ట కింది భాగంలో తాకింది. దీంతో అక్కడ రక్షణ కోసం పెట్టుకున్న గార్డ్ రెండు ముక్కలైంది. ఇంకేముంది అక్కడ కూలబడి రూట్ బాధతో విలపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా రూట్ తొలి ఇన్నింగ్స్‌లో 71 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.

ఇది ఇలా ఉండగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్‌లో ఆసీస్ విజయడంకా మోగించింది. 383 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే ఆసీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. సెకండ్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే ఓపెనర్ బర్న్స్, ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్‌ను ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్ డెన్‌లీ.. జాసన్ రాయ్ సహాయంతో స్కోర్ బోర్డు‌ను ముందుకు కదిలించినా.. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లాండ్ పరాజయం పాలైంది. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్ 4 వికెట్లు, హాజెల్‌వుడ్, లియోన్ 2 వికెట్లు.. స్టార్క్, లాబు‌శ్చాగ్నే చెరో వికెట్ తీశారు.

అంతకముందు మొదటి ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా 497 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పటిలానే స్టీవ్ స్మిత్ ఆసీస్ బ్యాటింగ్‌కు వెన్నుముకలా నిలిచి డబుల్ సెంచరీ సాధించాడు. స్మిత్‌ను ఔట్ చేయడానికి ఇంగ్లాండ్ బౌలర్లు పడరాని పాట్లు పడ్డారని చెప్పాలి. ఆ తర్వాత ఇంగ్లాండ్ 301 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసి 186 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ ఎదుట 383 పరుగుల భారీ టార్గెట్‌ను పెట్టింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu