రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన కేరళ యువతి… దేశంలోనే అతిపిన్న వయసున్న మేయర్‌గా రికార్డు.
కేరళకు చెందిన ఆర్యా రాజేంద్రన్ అనే 21 ఏళ్ల యువతి దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. తిరువనంతపురం మేయర్ పీఠాన్ని అధిరోహించి దేశాన్ని తనవైపు తిప్పుకున్నారు. వివరాల్లోకి వెళితే..

youngest Mayor in Kerala: కేరళకు చెందిన ఆర్యా రాజేంద్రన్ అనే 21 ఏళ్ల యువతి దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. తిరువనంతపురం మేయర్ పీఠాన్ని అధిరోహించి దేశాన్ని తనవైపు తిప్పుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రానికి చెందిన ఆర్యా రాజేంద్రన్ తిరువనంతపురంలోని ఆల్ స్టేయింట్స్ కాలేజీలో బీఎస్సీ మ్యాథ్స్ రెండో సంవత్సరం చదుతున్నారు. తాజాగా ఆర్యా.. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో సీపీఎం తరఫున విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్శించారు. ఎన్నికల్లో విజయం సాధించిన అతిపిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. ఇక 21 ఏళ్లకే ఏకంగా మేయర్ పీఠాన్ని అధిరోహించే లక్కీ ఛాన్స్ కొట్టేశారీమే.. తిరువనంతపురం మేయర్ అభ్యర్థిగా ఆర్యా రాజేంద్రన్‌ను ఎంపిక చేస్తున్నట్లు పార్టీ పెద్దలు ప్రకటించారు. దీంతో దేశంలోనే అతిపిన్న వయసులో మేయర్ పీఠం అధిరోహిస్తున్న యువతిగా ఆర్యా రికార్డు సృష్టించనున్నారు. ప్రస్తుతం తన చదువును కొనసాగిస్తోన్న ఆర్యా.. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు.




