టూరిజంపై కరోనా ఎఫెక్ట్.. విదేశీయుల రాకపై ఆంక్షలు!
చైనాలో ప్రాణం పోసుకొని 73దేశాలను గడగడలాడిస్తోంది కరోనావైరస్. ఈ ఈ క్రమంలో దాన్ని అడ్డుకునేందుకు అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలోకి విదేశీయుల రాకపై నిషేధం
చైనాలో ప్రాణం పోసుకొని 73దేశాలను గడగడలాడిస్తోంది కరోనావైరస్. ఈ ఈ క్రమంలో దాన్ని అడ్డుకునేందుకు అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలోకి విదేశీయుల రాకపై నిషేధం విధించింది. కేరళలో తాజాగా ఒకే రోజు ఐదు కరోనా కేసులు నమోదు కావడంతో వైరస్ బాధితుల సంఖ్య 39కి చేరింది. దీంతో అప్రమత్తమైన అరుణాచల్‌ప్రదేశ్ పలు నిర్ణయాలు తీసుకుంది. కాగా.. కేరళలో ఇంతకుముందు కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వైరస్ బాధితులు కోలుకున్నారు. వైరస్ బారిన పడి మరో ఐదుగురు తాజాగా ఆసుపత్రిలో చేరారు.
కోవిద్ 19 వైరస్ చైనాతో పాటు ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో మరణమృదంగం మోగిస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టిన అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం అందులో భాగంగా రాష్ట్రంలోకి విదేశీయుల ప్రవేశంపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశీయులకు రక్షిత ప్రాంత అనుమతులు(పీఏపీ) ఇవ్వడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. కాగా.. చైనాతో సరిహద్దును పంచుకునే అరుణాచల్ ప్రదేశ్‌లోకి పీఏపీలకు ప్రవేశం అనుమతించాలని విదేశీయులు కోరుతున్నారు.