‘సర్కారు వారి పాట’లో అరవింద స్వామి..?
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కరోనా తీవ్రత తగ్గిన తర్వాతే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుండగా.. ప్రస్తుతం చిత్ర యూనిట్ నటీనటులు ఎంపికపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఈ మూవీలో విలన్‌గా మొదట సుదీప్, హీరో ఉపేంద్ర పేర్లు వినిపించాయి. ఇక ఇప్పుడు తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘ధృవ’ సినిమాతో […]

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కరోనా తీవ్రత తగ్గిన తర్వాతే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుండగా.. ప్రస్తుతం చిత్ర యూనిట్ నటీనటులు ఎంపికపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఈ మూవీలో విలన్‌గా మొదట సుదీప్, హీరో ఉపేంద్ర పేర్లు వినిపించాయి. ఇక ఇప్పుడు తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది.
రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘ధృవ’ సినిమాతో స్టైలిష్ విలన్‌గా పేరు తెచ్చుకున్న అరవింద్ స్వామిని ఈ మూవీలో ప్రతినాయకుడి పాత్రకు తీసుకోవాలని యూనిట్ భావిస్తోందట. ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు జరపాలని చూస్తున్నారని టాలీవుడ్ టాక్. జీఎమ్‌బీ, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.