జగన్ కీలక నిర్ణయం.. ఆర్టీసీ ఉద్యోగులకు దసరా గిఫ్ట్!
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా పెంచాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. దీన్ని ఈ నెల నుంచే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆర్టీసీ విలీనం నేపథ్యంలో.. సిబ్బంది పదవి విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఈ నెలలో రిటైర్ అయ్యే ఉద్యోగుల పదవీ కాలాన్ని పెంచేందుకు సీఎం […]

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా పెంచాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. దీన్ని ఈ నెల నుంచే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆర్టీసీ విలీనం నేపథ్యంలో.. సిబ్బంది పదవి విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఈ నెలలో రిటైర్ అయ్యే ఉద్యోగుల పదవీ కాలాన్ని పెంచేందుకు సీఎం సూత్రపాయంగా అంగీకరించినట్లు తెలిసింది.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసిన ఆంజనేయరెడ్డి కమిటీ ఆర్టీసీ విలీన, విద్యుత్తు బస్సులపై నివేదికను సీఎంకు అందించారు. ఆర్టీసీలో సిబ్బంది వయో పరిమితి పెంపు సిఫార్సును వెంటనే అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ విషయంపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను త్వరలోనే రోజుల్లో జారీ చేయనుంది.
ఇటీవల సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆర్టీసీలో పదవీ విరమణ వయస్సుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అంగీకారం తెలిపింది. దీంతో ఆర్టీసీలోని 53వేల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరుతుంది.




