AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేనెక్కడికి వెళ్లినా.. అందరి ఆశా ఇండియా మీదే ! నా పర్యటన సక్సెస్ !

‘నేనెక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా.. వాళ్ళు ప్రపంచ నాయకులైనా… పారిశ్రామికవేత్తలైనా.. అన్ని రంగాల ప్రముఖులైనా.. అందరిదీ ఒకే స్పిరిట్ ! అదే ! ఇండియా పట్ల ఆశాభావం ! భారత్ పై గౌరవం..ఆదరం.. ఇండియాపై ప్రపంచ నాయకులు ఆశావహ దృక్పథాన్ని ప్రదర్శించడమే మన ఔన్నత్యానికి కారణం ‘… అని ప్రధాని మోదీ అన్నారు. అమెరికాలో వారం రోజుల పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీ బయలుదేరిన ఆయన.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు, ఆ దేశ ప్రజలకు ధన్యవాదాలు […]

నేనెక్కడికి వెళ్లినా.. అందరి ఆశా ఇండియా మీదే ! నా పర్యటన సక్సెస్ !
Anil kumar poka
|

Updated on: Sep 28, 2019 | 11:25 AM

Share

‘నేనెక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా.. వాళ్ళు ప్రపంచ నాయకులైనా… పారిశ్రామికవేత్తలైనా.. అన్ని రంగాల ప్రముఖులైనా.. అందరిదీ ఒకే స్పిరిట్ ! అదే ! ఇండియా పట్ల ఆశాభావం ! భారత్ పై గౌరవం..ఆదరం.. ఇండియాపై ప్రపంచ నాయకులు ఆశావహ దృక్పథాన్ని ప్రదర్శించడమే మన ఔన్నత్యానికి కారణం ‘… అని ప్రధాని మోదీ అన్నారు. అమెరికాలో వారం రోజుల పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీ బయలుదేరిన ఆయన.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు, ఆ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నేను వెళ్లిన చోటల్లా భారత దేశం పట్ల విశ్వజనీన నమ్మకాన్ని, ఆశాభావాన్ని కనుగొన్నాను అని ఆయన తెలిపారు. పారిశుధ్య మెరుగుదల, హెల్త్ కేర్, పేదరిక నిర్మూలనకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించని వారు లేరు అని పేర్కొన్నారు. ‘ నా ఈ అమెరికా పర్యటన జయప్రదమైంది. కొన్ని రోజులుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చాను. ఇవన్నీ ఇండియాకు, మన అభివృద్ది లక్ష్యానికి దోహదపడేవే ‘ అని మోదీ ట్వీట్ చేశారు.’ ఐక్యరాజ్యసమితిలో ఇతర ప్రపంచ నాయకులతో నా ఆలోచనలు షేర్ చేసుకున్నాను. ఈ భూమండలాన్ని అత్యంత శాంతియుతంగా, సామరస్యపూరితంగా , కలివిడిగా ఉంచేందుకు ఇండియాను ఓ చక్కని దేశంగా మలచడానికి కృషి చేస్తూ వచ్చాను..నా ఈ ధ్యేయాన్ని అందరికీ వివరించడమే కాదు.. తోటి ప్రపంచ నేతలతో అద్భుతమైన ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించాను.. ‘ అని ఆయన అన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి అంతా కలిసి రావాలని కోరానని, మహాత్మా గాంధీ 150 వ జయంతి ఉత్సవాల నిర్వహణకు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోవడం ఇండియాకే చెల్లిందని అన్నారు. హూస్టన్ లో ఇంధన, చమురు రంగాల సీఈఓలతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని, ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని మోదీ తెలిపారు.

‘ హౌడీమోదీ ‘ కార్యక్రమాన్ని తానెప్పుడూ విస్మరించబోనని, ఇండియాతో గల మైత్రీ సంబంధాలకు అమెరికా ఎంత విలువ ఇస్తోందో గమనించానని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ కు, అమెరికన్ కాంగ్రెస్ సభ్యులకు, ఆ ప్రభుత్వంలోనివారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో మాట్లాడిన మోదీ.. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లు, క్లైమేట్ ఛేంజ్ వంటివాటిని ప్రస్తావించారు. అటు-ప్రముఖ తమిళ కవి కనియన్ పుంగునోద్రనార్ రచించిన ఓ కవితను మోడీ గుర్తు చేశారు. మనం అన్ని ప్రాంతాలకూ చెందినవారం.ప్రతివారితోనూ ఉన్న అనుబంధం మనది.. అన్నారాయన.. ఆరో శతాబ్దం నాటి ఆ కవి నాడే ఈ విషయాన్ని చెప్పారని మోదీ వ్యాఖ్యానించారు. ఈ ప్రపంచంలో సర్వ మానవాళి శాంతి, సామరస్యాల కోసం పరస్పరం సహకరించుకోవాలని ఆ కవి ఆ నాడే బోధించారని అన్నారు.