ఇక ట్యాబ్‌లతో గ్రూప్ 1 మెయిన్స్: ఏపీపీఎస్సీ

గ్రూప్ -1 ప్రధాన పరీక్షలను నిర్వహించడంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాబ్‌ల ద్వారా ప్రశ్నపత్రాలను జారీ చేయాలని కమిషన్ నిర్ణయించింది. వచ్చే నెలలో జరగబోయే ఈ పరీక్షల్లో ఈ విధానం మొదటిసారిగా అమలు చేయబోతున్నారు. ట్యాబ్‌ను ఎలా ఉపయోగించాలి అన్న వివరాలు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. పరీక్ష రాసిన తరువాత అభ్యర్థుల నుండి ట్యాబ్‌లు తీసుకుంటారు. ఈ ఏడాది గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు ఎనిమిది వేలకు పైగా […]

ఇక ట్యాబ్‌లతో గ్రూప్ 1 మెయిన్స్: ఏపీపీఎస్సీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 16, 2020 | 6:49 AM

గ్రూప్ -1 ప్రధాన పరీక్షలను నిర్వహించడంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్యాబ్‌ల ద్వారా ప్రశ్నపత్రాలను జారీ చేయాలని కమిషన్ నిర్ణయించింది. వచ్చే నెలలో జరగబోయే ఈ పరీక్షల్లో ఈ విధానం మొదటిసారిగా అమలు చేయబోతున్నారు.

ట్యాబ్‌ను ఎలా ఉపయోగించాలి అన్న వివరాలు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. పరీక్ష రాసిన తరువాత అభ్యర్థుల నుండి ట్యాబ్‌లు తీసుకుంటారు. ఈ ఏడాది గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు ఎనిమిది వేలకు పైగా అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ (ఎపిపిఎస్సి) ఎపిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష యొక్క సవరించిన తేదీలను ప్రకటించింది. 2019 డిసెంబర్ 12 నుండి డిసెంబర్ 23 వరకు నిర్వహించాల్సిన పరీక్షలను ఫిబ్రవరికి వాయిదా వేసింది.