AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వినియోగదారులకు శుభవార్త.. గూగుల్‌కి పోటీగా యాపిల్…

యాపిల్ వినియోగదారులకు త్వరలో శుభవార్త చెప్పనుంది. ఇకపై గూగుల్ సెర్చ్ ఇంజన్లు యాహూ, బింగ్ కు పోటీగా సెర్చ్ ఇంజిన్ ను తెచ్చేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది.

వినియోగదారులకు శుభవార్త.. గూగుల్‌కి పోటీగా యాపిల్...
Balu
|

Updated on: Aug 30, 2020 | 5:06 PM

Share

యాపిల్ వినియోగదారులకు త్వరలో శుభవార్త చెప్పనుంది. ఇకపై గూగుల్ సెర్చ్ ఇంజన్లు యాహూ, బింగ్ కు పోటీగా సెర్చ్ ఇంజిన్ ను తెచ్చేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది. గతంలో ఒకటి రెండు సెర్చ్ ఇంజిన్లు వచ్చినా అవి గూగుల్ ముందు పెద్దగా నిలబడలేకపోయాయి. టెక్ వెబ్‌సైట్ కోయ్ వోల్ఫ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించటానికి సిద్దమవుతోంది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటోంది. యాపిల్ తన స్పాట్‌లైట్ సెర్చ్ ఇంజిన్ కోసం ఇంజినీర్లను తీసుకుంటున్నట్లు సమాచారం. స్పాట్‌లైట్ అనేది ఎంఏసీ ఓఎస్ లో ముఖ్యమైన సర్చింగ్ అప్షన్. ఇక్కడ మ్యాక్‌బుక్ నుంచి వెబ్‌కు సర్చింగ్ అవకాశముంటుంది.

యాపిల్ తన కొత్త ఏఓఎస్ 14 వెర్షన్‌లో గూగుల్ సెర్చ్‌ను దాటేసింది. సెర్చ్ ఇంజిన్ల కోసం యాపిల్ చేయబోయే నియామకాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్నెల్పీ) వంటి రంగాల్లోని నిపుణులకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్, ఐప్యాడ్, మాక్ ఓఎస్‌లలో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్‌ను ఉంచడానికి గూగుల్ ఏటా యాపిల్‌కు మిలియన్ల డాలర్లను వెచ్చిస్తోంది. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు తానే స్వయంగా సెర్చ్ ఇంజన్ ను రూపొందించేందుకు ఫ్లాన్ చేస్తోంది.

త్వరలోనే ఈమేరకు ఒప్పందం చేసుకోనుంది యాపిల్ సంస్థ. కోయ్ వోల్ఫ్ నివేదిక ప్రకారం.. యూకే కాంపిటీషన్ అండ్ మార్కెట్ అథారిటీ నివేదిక ప్రపంచంలో యాపిల్ మార్కెట్ వాటా చాలా ఎక్కువగా ఉంది. అటువంటి పరిస్థితిలో గూగుల్ సెర్చ్ డిఫాల్ట్ అయినందున ఇతర సెర్చ్ ఇంజిన్లకు మొబైల్ ఫోన్లలోకి ప్రవేశించే అవకాశం లభించదని నమ్ముతుంది. తాజాగా యాపిల్ రూపొందిస్తున్న ఈసెర్చ్ ఇంజిన్‌ను గూగుల్‌కు ప్రత్యామ్నాయంగా మారనుంది. ప్రాజెక్టు విజయవంతంమైన తర్వాత వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

Follow Us
40 కిలోల బరువు తగ్గిన నటి ఖుష్బూ.. వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే
40 కిలోల బరువు తగ్గిన నటి ఖుష్బూ.. వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే
ఓవర్‌థింకింగ్‌ లో బంధీ అయ్యారా? బుద్ధుడు చెప్పిన ఈ కథ మీ కోసమే
ఓవర్‌థింకింగ్‌ లో బంధీ అయ్యారా? బుద్ధుడు చెప్పిన ఈ కథ మీ కోసమే
పింఛన్లపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్.. శుభవార్త వచ్చేసింది..
పింఛన్లపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్.. శుభవార్త వచ్చేసింది..
రణబాలి డాక్యుమెంటరీ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది..
రణబాలి డాక్యుమెంటరీ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసింది..
అరెరే హోటల్‌ రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాస్‌ను గుర్తించడం ఇంత సింపులా
అరెరే హోటల్‌ రూమ్‌లో సీక్రెట్‌ కెమెరాస్‌ను గుర్తించడం ఇంత సింపులా
IIT-JEEలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్.. ఇప్పుడు దోమ మెదడుపై పరిశోధన
IIT-JEEలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్.. ఇప్పుడు దోమ మెదడుపై పరిశోధన
ట్రైన్‌లో బైక్ పార్శిల్ చేయాలా? ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.
ట్రైన్‌లో బైక్ పార్శిల్ చేయాలా? ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.
ఆ హీరోతో యాక్టింగ్ అంటే భయం.. అతడు గొప్ప నటుడు..
ఆ హీరోతో యాక్టింగ్ అంటే భయం.. అతడు గొప్ప నటుడు..
రైతులకు కాసుల వర్షమే.. తక్కువ నీటితో నెల తిరిగేసరికి జేబు నింపే..
రైతులకు కాసుల వర్షమే.. తక్కువ నీటితో నెల తిరిగేసరికి జేబు నింపే..
రాత్రి దానిమ్మ ఆకుల కషాయం తాగితే ఏమవుతుందో తెలుసా?
రాత్రి దానిమ్మ ఆకుల కషాయం తాగితే ఏమవుతుందో తెలుసా?