గుడ్ న్యూస్ : కడపలో ఆపిల్ తయారీ యూనిట్ !

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దేశంలోనే టాప్ ప్లేసులో నిలిచి సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ కు మరో పెద్ద ప్రాజెక్టు రానుంది.

గుడ్ న్యూస్ : కడపలో ఆపిల్ తయారీ యూనిట్ !
Follow us

|

Updated on: Sep 08, 2020 | 2:57 PM

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే టాప్ ప్లేసులో నిలిచి సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ కు మరో పెద్ద ప్రాజెక్టు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత పొందిన టెక్నాలజీ సంస్థ ఆపిల్ తన తయారీ యూనిట్ ను ఏపీలో పెట్టేందుకు రెడీ అవుతుంది. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలోని కొప్పర్తి పారిశ్రామిక ఏరియాలో నిర్మితం అవ్వనున్న ఈ ఫ్యాక్టరీ ద్వారా దాదాపు 50 వేల మందికి ఉపాధి దొరకనుంది. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.

ఆపిల్ కంపెనీకి చైనాలో ఆరు తయారీ యూనిట్స్ ఉన్నట్లు మంత్రి తెలిపారు. అక్కడి ఒక్కో ఫ్యాక్టరీలో 1లక్ష నుంచి 6 లక్షల మంది వరకు ఉపాధి పొందుతున్నారని, అదే మోడల్ లో కడప జిల్లాలోనూ భారీ ఉత్పాదక విభాగాన్ని స్థాపించేలా ఆపిల్ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు మంత్రి వివరించారు. దాదాపు ఈ ప్రాజెక్టు  ఫైనలైపోయిందని.. అంచనా వ్యయం, ఇతర వివరాలను అతి త్వరలోనే తెలుపుతామన్నారు.

Also Read :పులి, అడవిపంది మధ్య టఫ్ ఫైట్, చివరికి ఏం జరిగిందంటే