పులి, అడవిపంది మధ్య టఫ్ ఫైట్, చివరికి ఏం జరిగిందంటే

అడవిలో జంతువుల మధ్య ఫైట్స్ రెగ్యూలర్ గా చూస్తూనే ఉంటాం. అయితే పులి, సింహాలపై కయ్యానికి కాలుదువ్వే జంతువులు మాత్రం చాలా అరుదు.

పులి, అడవిపంది మధ్య టఫ్ ఫైట్, చివరికి ఏం జరిగిందంటే
Follow us

|

Updated on: Sep 08, 2020 | 2:26 PM

అడవిలో జంతువుల మధ్య ఫైట్స్ రెగ్యూలర్ గా చూస్తూనే ఉంటాం. అయితే పులి, సింహాలపై కయ్యానికి కాలుదువ్వే జంతువులు మాత్రం చాలా అరుదు. తాజాగా అస్సాంలోని కజిరంగా జాతీయపార్కులో పులి, అడవిపంది మధ్య  ఓ రేంజ్ ఫైట్ జరిగింది. ఈ యద్ధంలో చివరికి  ఆ రెండూ ప్రాణాలు విడిచాయి.  ఇతర జంతువుల దాడిలో పులి చనిపోవడం మాములు విషయం కాదు. కానీ అడవిపంది పోరాటంలో ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. పులిని తీవ్రంగా గాయపరిచింది. ఇలాంటి సంఘటన జరుగడం ఈ రిజర్వులో ఫస్ట్ టైమ్ అని అటవీ అధికారులు తెలిపారు.

టైగర్‌ రిజర్వులోని కోహోరా అటవీ శ్రేణిలోగల టెటెలెగురి యాంటీ పోచింగ్ క్యాంప్ దగ్గర్లో ఈ ఘర్షణ జరిగింది. శనివారం సాయంత్రం రెండు జంతువుల డెడ్ బాడీలను అటవీ అధికారులు గుర్తించారు.  ‘పులికి కడుపులో తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. అలాగే, అడవిపంది శరీరంపైనా బలమైన గాయాలున్నాయి. తీవ్ర గాయాలతో అవి అక్కడినుంచి కదలలేని స్థితిలో చనిపోయాయి.’ అని కజిరంగా పరిశోధనా అధికారి రాబిన్ శర్మ తెలిపారు.

Also Read :

పార్టీ ప్రధాన అధికార ప్రతినిధిగా శివసేన నేత సంజయ్ రౌత్ !