AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అపార్ట్‌మెంట్‌లో ఇల్లు కొంటున్నారా.. కింది ఫ్లోర్ వర్సెస్ పై ఫ్లోర్.. వాస్తు ప్రకారం ఏది మంచిది?

సొంతిల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే సమయంలో వాస్తు నియమాలు పాటించడం చాలామందికి అలవాటు. ముఖ్యంగా అపార్ట్‌మెంట్ సంస్కృతి పెరిగిన ఈ రోజుల్లో, కింది ఫ్లోర్లలోని ఫ్లాట్లకు, పై ఫ్లోర్లకు వాస్తులో ఏమైనా తేడాలు ఉంటాయా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. దీనిపై వాస్తు ప్రముఖులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

అపార్ట్‌మెంట్‌లో ఇల్లు కొంటున్నారా.. కింది ఫ్లోర్ వర్సెస్ పై ఫ్లోర్.. వాస్తు ప్రకారం ఏది మంచిది?
Lower Floor Vs Higher Floor
Jyothi Gadda
|

Updated on: Aug 13, 2026 | 6:18 PM

Share

అపార్ట్‌మెంట్లలో కింది ఫ్లాట్లకు, పై ఫ్లాట్లకు వాస్తు పరంగా నిర్మాణంలో వ్యత్యాసం ఉండదని, అయితే మనిషి భూమికి దగ్గరగా జీవించడమే మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే, ఊరి సరిహద్దుల ప్రభావం కంటే, మన ఇంటిని శాస్త్రబద్ధంగా నిర్మించుకోవడమే ప్రధానమని స్పష్టం చేశారు. స్థలం ఎంపికలో తూర్పు మాత్రమే కాకుండా, పడమర కూడా సరైన లక్షణాలు ఉంటే మంచి ఫలితాలనిస్తుందని వివరించారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

అపార్ట్‌మెంట్లలో ఫ్లోర్ల ఎంపిక – వాస్తు నిబంధనలు:

కింది అంతస్తుల్లో ఉండే ఫ్లాట్లకు, ఎనిమిది లేదా పన్నెండు వంటి పై అంతస్తుల్లో ఉండే ఇళ్లకు నిర్మాణ పరంగా ఎలాంటి తేడా ఉండదు. అయితే, శాస్త్రం ప్రకారం మనిషి భూమికి వీలైనంత దగ్గరగా ఉండటమే మంచిది. ప్రకృతి ఒడిలో నేలకు దగ్గరగా, చెట్లు చేమల మధ్య జీవించడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. ఆకాశంలో కేవలం గాలి సుడుల మధ్య ఉండటం కంటే, 4, 5 లేదా 6వ అంతస్తుల వరకు నివసించడం ఆరోగ్యానికి, ఆనందానికి శ్రేయస్కరమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

రోడ్లు, మలుపులు – వీధిపోటు దోషాలు:

రోడ్డు మధ్యలో ఉన్న పెద్ద గుండ్లు లేదా కొండల వద్ద వీధులు వంపు తిరిగినప్పుడు ఇళ్లకు అనుకోకుండా నైరుతి లేదా ఆగ్నేయ వీధిపోట్లు వచ్చే ప్రమాదం ఉంది. చౌరస్తాల వద్ద గుండ్రంగా వచ్చే వీధులు కూడా తెలియకుండా దోషాలను తెచ్చిపెడతాయి. ఇటువంటి దోషాలు ఉన్న స్థలాలను ఎంచుకుంటే జీవితాంతం నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి, ముందే సరిచూసుకోవడం అవసరం.

ఇవి కూడా చదవండి

ఊరి సరిహద్దులు – ఇంటి ప్రాధాన్యత:

గ్రామం లేదా ప్రాంత సరిహద్దుల్లో కొండలు, నదులు లేదా వాగులు ఉన్నప్పుడు దాని ప్రభావం సమష్టిగా ఊరిపై ఉంటుంది. అయితే ఊరికి ఉన్న దోషాల కంటే, మన స్వంత ఇంటిని వాస్తు ప్రకారం, శాస్త్రబద్ధంగా నిర్మించుకుంటే ఆ ఊరి ప్రతికూల ప్రభావం మన ఇంటిపై పడదని పండితులు స్పష్టం చేశారు.

తూర్పు ప్లాట్ వర్సెస్ పడమర ప్లాట్:

సాధారణంగా చాలామంది తూర్పు ప్లాట్ అనగానే గొప్పది, పడమర అనగానే పనికిరానిది అనుకుంటారు. కానీ, తూర్పు స్థలం ఉదయించే సూర్యుడికి, పడమర స్థలం అస్తమించే సూర్యుడికి ఆప్తుడిగా ఉంటాయి. స్థలం భౌతిక లక్షణాలు, దిశలు సరిగ్గా ఉంటే పడమర ప్లాట్ కూడా తూర్పు కంటే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి, దిశలను మాత్రమే చూడకుండా, స్థల గుణగణాలను లోతుగా పరిశీలించి ఎంపిక చేసుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం ప్రధానంగా వాస్తు, సంప్రదాయ విశ్వాసాల ఆధారిత సూచనలు మాత్రమే. ఆరోగ్యం లేదా ఆర్థిక ప్రయోజనాలకు శాస్త్రీయ హామీగా పరిగణించకూడదు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
సముద్రపు చేపలు vs నది, చెరువు చేపలు.. వీటిలో ఏవి మంచివి..?
సముద్రపు చేపలు vs నది, చెరువు చేపలు.. వీటిలో ఏవి మంచివి..?
అపార్ట్‌మెంట్‌లో ఇల్లు కొంటున్నారా?కింది ఫ్లోర్ వర్సెస్ పై ఫ్లోర్
అపార్ట్‌మెంట్‌లో ఇల్లు కొంటున్నారా?కింది ఫ్లోర్ వర్సెస్ పై ఫ్లోర్
బర్త్‌డే రోజే సచిన్ రికార్డును బద్దలు కొట్టిన అఫ్గాన్ సంచలనం
బర్త్‌డే రోజే సచిన్ రికార్డును బద్దలు కొట్టిన అఫ్గాన్ సంచలనం
12 ఏళ్ల వయసులోనే పెళ్లి.. నిండు గర్భంపై కాలితో తన్నిన భర్త..
12 ఏళ్ల వయసులోనే పెళ్లి.. నిండు గర్భంపై కాలితో తన్నిన భర్త..
ఇంట్లోనే కూర్చుని స్మార్ట్‌ఫోన్ ద్వారా రేషన్ eKYC చేయడం ఎలా?
ఇంట్లోనే కూర్చుని స్మార్ట్‌ఫోన్ ద్వారా రేషన్ eKYC చేయడం ఎలా?
గురు చంద్రుల అనుబంధం.. ఆ రాశుల వారికి కనక వర్షం
గురు చంద్రుల అనుబంధం.. ఆ రాశుల వారికి కనక వర్షం
ఈ రెసిపీ కోసం గూగుల్ మొత్తం జల్లెడ పట్టేశారా.. అంత స్పెషల్ మరి
ఈ రెసిపీ కోసం గూగుల్ మొత్తం జల్లెడ పట్టేశారా.. అంత స్పెషల్ మరి
కారు లోన్ తీసుకునేటప్పుడు అందురూ చేసే తప్పులు ఇవే..
కారు లోన్ తీసుకునేటప్పుడు అందురూ చేసే తప్పులు ఇవే..
ఇంటి ఆవరణలో అరటి చెట్టు పెంచుతున్నారా? ఈ తప్పులు చేశారంటే తప్పదు
ఇంటి ఆవరణలో అరటి చెట్టు పెంచుతున్నారా? ఈ తప్పులు చేశారంటే తప్పదు
యశ్‌ను కర్ణాటకలో ఉండనివ్వం.. 'టాక్సిక్‌'పై హీరోయిన్ విమర్శలు
యశ్‌ను కర్ణాటకలో ఉండనివ్వం.. 'టాక్సిక్‌'పై హీరోయిన్ విమర్శలు