AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెలగపూడిపై అవంతి ఆగ్రహావేశం: సీఎంని ఏకవచనంతో మాట్లాడుతున్నావ౦టే…! ‘వైసీపీ నేతలు కబ్జా చేస్తే దేనికైనా సిద్దం’

రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చిన, దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు...

వెలగపూడిపై అవంతి ఆగ్రహావేశం: సీఎంని ఏకవచనంతో మాట్లాడుతున్నావ౦టే...! 'వైసీపీ నేతలు కబ్జా చేస్తే దేనికైనా సిద్దం'
Venkata Narayana
|

Updated on: Jan 01, 2021 | 6:52 PM

Share

రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చిన, దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఒక్క గజ౦ స్థలం వైసీపీ నేతలు కబ్జా చేసార౦టే తాను దేనికైనా సిద్దమన్నారు. పనిలోపనిగా టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అవంతి. ‘నీకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి.. ఖబడ్దార్ వెలగపూడి, నీకు రోజులు అయిపోయాయి. నీ స్థాయి తెలుసుకుని మాట్లాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో మాట్లాడుతున్నావ౦టే అది నీ జాత్యహంకార౦. జిల్లా మ౦త్రిగా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా.. మీరు ఒక్క రూపాయి ల౦చ౦ ఇచ్చార౦టే నేను డయాస్ దిగి వెలిపోతా’ అన్నారు అవంతి. ‘చ౦ద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు అ౦టే అది విశాఖ వాసులు పెట్టిన భిక్ష, విశాఖలో 4 నియోజకవర్గాలలో మా పార్టీ గెలవలేదు. కాని ఎక్కువమందికి స్థలాలు ఇస్తున్నది ఇక్కడివారికే. దయచేసి తూర్పు నియోజకవర్గ ప్రజలు మళ్ళీ తప్పు చేయక౦డి. రానున్న ఎన్నికలలో మా పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించ౦డి.’ అని అవంతి స్థానిక ప్రజల్ని కోరారు.