స్థానిక సంస్థ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఏపీ సీఎస్ లేఖ.. ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదంటూ.!

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల నిర్వహణ అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌‌ కుమార్‌కు చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని లేఖ రాశారు.

స్థానిక సంస్థ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఏపీ సీఎస్ లేఖ.. ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదంటూ.!
Follow us

|

Updated on: Nov 18, 2020 | 4:47 PM

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల నిర్వహణ అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌‌ కుమార్‌కు చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని లేఖ రాశారు. రాష్ట్రంలోని అధికారులు, పోలీసులు కరోనా విధుల్లో ఉన్నందున ఎలక్షన్స్ నిర్వహించడం సాధ్యం కాదని అందులో పేర్కొన్నారు. అన్ని విధాలుగా ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్‌ను తెలియజేస్తామని ఆమె అన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని, ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని సాహ్ని తన లేఖలో పేర్కొన్నారు.  ఇదిలా ఉంటే ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రధాన అధికారులతో నీలం సాహ్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల అంశం సెగలు పుట్టిస్తోంది. కరోనా కేసులు తగ్గుతుండటం వల్ల ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలను నిర్వహించాలని ఈసీ అభిప్రాయపడుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చెయ్యట్లేదు. ఇక అలాగే టీడీపీ మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ తెరపైకి కొత్త డిమాండ్ తీసుకొచ్చింది. ఈ తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇవాళ ఉదయం 11.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలవనున్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణ, రాజకీయ పార్టీల అభిప్రాయాలు వంటి అంశాలను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్‌కు వివరించనున్నారు.

Also Read:

‘వైఎస్సార్ సున్నా వడ్డీ పధకం’.. వారికి మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!

ఐపీఎల్ 2021: మారనున్న టీమ్స్ రూపురేఖలు.. మెగా ఆక్షన్‌లోకి ధోని, స్మిత్, విలియమ్సన్‌లు వచ్చే అవకాశం..

Flash News: ఫిబ్రవరిలో ఏపీ పంచాయితీ ఎన్నికలు.. ఎస్‌ఈసీ కీలక ప్రకటన..?

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..