ఐపీఎల్ 2021: మారనున్న టీమ్స్ రూపురేఖలు.. మెగా ఆక్షన్‌లోకి ధోని, స్మిత్, విలియమ్సన్‌లు వచ్చే అవకాశం..
ఐపీఎల్ 2021పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. వచ్చే సీజన్‌ను ఇండియాలో జరిపేందుకు సన్నద్ధమవుతోంది. క్రికెట్ ఫ్యాన్స్‌కు మరింత కిక్కిచ్చేలా వచ్చే ఏడాది జరగబోయే..

IPL 2021: ఐపీఎల్ 2021పై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. వచ్చే సీజన్‌ను ఇండియాలో జరిపేందుకు సన్నద్ధమవుతోంది. క్రికెట్ ఫ్యాన్స్‌కు మరింత కిక్కిచ్చేలా వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్‌లో మరో టీమ్ రాబోతోందని ఓ టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇదిలా ఉంటే జనవరి లాస్ట్ వీక్ లేదా ఫిబ్రవరి మొదటి వారంలో మెగా ఆక్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రతీ ఫ్రాంచైజీ ముగ్గురు ఆటగాళ్లను అట్టే పెట్టుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా వారి జట్టులోని మెయిన్ ప్లేయర్స్‌ను ‘రైట్ టూ మ్యాచ్’ కార్డు(RTM) ద్వారా తీసుకుంటారని సమాచారం. కాగా, ఫ్రాంచైజీల వారీగా లిస్ట్ ఇలా ఉండబోతోందని అంచనా..
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా.. ప్రత్యామ్నాయ RTM ఎంపికలు: పొలార్డ్, బౌల్ట్, డికాక్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, చాహల్.. ప్రత్యామ్నాయ RTM ఎంపికలు: పడిక్కల్, సుందర్, ఫించ్
ఢిల్లీ క్యాపిటల్స్: శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, రబాడా.. ప్రత్యామ్నాయ RTM ఎంపికలు: నోర్తుజే, పంత్, అక్షర్ పటేల్
సన్‌రైజర్స్ హైదరాబాద్: రషీద్ ఖాన్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్.. ప్రత్యామ్నాయ RTM ఎంపికలు: బెయిర్‌స్టో, భువనేశ్వర్ కుమార్, మనీష్ పాండే
రాజస్థాన్ రాయల్స్: శాంసన్, బట్లర్, ఆర్చర్… ప్రత్యామ్నాయ RTM ఎంపికలు: స్మిత్, స్టోక్స్, టేవాటియా
కోల్‌కతా నైట్ రైడర్స్: మోర్గాన్, రస్సెల్, ప్యాట్ కమిన్స్.. ప్రత్యామ్నాయ RTM ఎంపికలు: నరైన్, ఫెర్గుసన్, దినేష్ కార్తీక్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్: కేఎల్ రాహుల్, షమీ, మయాంక్ అగర్వాల్.. ప్రత్యామ్నాయ RTM ఎంపికలు: క్రిస్ గేల్, జోర్డాన్, మ్యాక్స్‌వెల్
చెన్నై సూపర్ కింగ్స్: ధోని, సామ్ కరన్, దీపక్ చాహర్.. ప్రత్యామ్నాయ RTM ఎంపికలు: ఎంగిడి, జడేజా, రాయుడు
Also Read:
కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ మరో ముందడుగు.. ఆ జోన్ల పరిధిలోనే..!
ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలకు అలెర్ట్..!
ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి వడ్డీ రాయితీ సొమ్ము జమ.!