Sitara Ghattamaneni: అయ్య బాబోయ్.. సీతూ పాప ఎంత అందంగా ఉంది.. మహేష్ బాబు కూతురు బ్యూటీఫుల్ వీడియో..
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుంటూరు కారం సినిమాతో చివరిసారిగా హిట్టు కొట్టిన మహేష్.. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల కొన్ని రోజుల క్రితం SSMB29 ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ జోడిగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సార్డ్ కిడ్స్‌లో సితార ముందుంటుంది. చిన్నప్పటి నుంచే యూట్యూబ్, ఇన్ స్టాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది. తనకు నటనపై ఆసక్తి ఉందని.. సినిమాల్లోకి రావాలనుకుంటున్నట్లు కొన్ని రోజుల క్రితమే సితార చెప్పుకొచ్చింది. ఇప్పటికే ప్రముఖ జ్యువెల్లరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది సితార. ఇదిలా ఉంటే.. ఉగాది పండగ సందర్భంగా పట్టు పరికిణిలో మరింత అందంగా ముస్తాబయ్యింది సితార. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.
ఇక ఇప్పుడు మరోసారి సితార బ్యూటీఫుల్ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా ఓ కార్యక్రమానికి వెళ్లిన సితార.. రెడ్ డ్రెస్‌లో మరింత అందంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో సితార లుక్స్, చిరునవ్వు నెటిజన్లను కట్టిపడేస్తుంది. దీంతో ఫ్యాన్స్ స్పందిస్తూ.. ప్రిన్సెస్..అప్ కమింగ్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే సితారకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ కలిగి ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు సితార ఘట్టమనేని తన తల్లి నమ్రతతో కలిసి ఒక బ్రాండ్ ప్రమోషన్‌కు హాజరైనట్లు తెలుస్తోంది. సితార ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రమోషనల్ సాంగ్‌లో కూడా కనిపించింది. సితారు వయసు ప్రస్తుతం 13 ఏళ్లు. ఇప్పటికే ఆమెకు ఇన్ స్టాలో 2.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..