‘వైఎస్సార్ సున్నా వడ్డీ పధకం’.. వారికి మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!

వైఎస్సార్ సున్నా వడ్డీ పధకం కింద అర్హత ఉండి కూడా లబ్ది పొందలేని రైతులకు ఏపీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇప్పటికే అర్హుల జాబితాను..

'వైఎస్సార్ సున్నా వడ్డీ పధకం'.. వారికి మరో అవకాశాన్ని కల్పించిన జగన్ సర్కార్.!
Follow us

|

Updated on: Nov 17, 2020 | 8:36 PM

YSR Zero Interest Scheme: వైఎస్సార్ సున్నా వడ్డీ పధకం కింద అర్హత ఉండి కూడా లబ్ది పొందలేని రైతులకు ఏపీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇప్పటికే అర్హుల జాబితాను సంబంధిత సచివాలయాల్లో ప్రదర్శించామని.. ఆ జాబితాలో పేర్లు నమోదు కానివారు తమ సమీప గ్రామ సచివాలయాల్లో గానీ.. వాలంటీర్లకు గానీ వివరాలు అందించాలని తెలిపింది. అలా కాకపోతే 155251 టోల్‌ఫ్రీ నెంబర్‌‌కు కాల్ చేసి నమోదు చేసుకోవాలని సూచించింది.

అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి లబ్ది చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. అందుకే ఈ నెలలో వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించామని.. పలు పథకాలతో కొత్తవారికి ప్రయోజనం కల్పించామని స్పష్టం చేసింది. కాగా, పంటల బీమా కింద రైతులు తమ వాటాగా కేవలం రూ.1 చెల్లిస్తే, ప్రభుత్వం పూర్తి ప్రీమియమ్‌ (రైతుల వాటా రూ.506 కోట్లు సహా).. దాదాపు రూ.1031 కోట్లు చెల్లిస్తుందని తెలిపింది. ఆ బీమాకు సంబంధించి సుమారు రూ.1800 కోట్ల బీమా క్లెయిమ్‌ డిసెంబర్‌లో చెల్లించే కార్యక్రమం జరుగుతుందని పేర్కొంది.

Also Read:

కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ మరో ముందడుగు.. ఆ జోన్ల పరిధిలోనే..!

ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలకు అలెర్ట్..!

ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి వడ్డీ రాయితీ సొమ్ము జమ.!