అదుపుతప్పిన బస్సు పంటపొలాల్లో బోల్తా… ముగ్గురు మృతి, మరో 15 మందికి తీవ్ర గాయాలు

ఒడిశాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. పది సంఖ్యలో తీవ్రగాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు.

అదుపుతప్పిన బస్సు పంటపొలాల్లో బోల్తా... ముగ్గురు మృతి, మరో 15 మందికి తీవ్ర గాయాలు
Follow us

|

Updated on: Nov 17, 2020 | 4:16 PM

#Odishabusaccident: ఒడిశాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. పది సంఖ్యలో తీవ్రగాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. రాయగఢ్ జిల్లాలో ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ర్టంలోని లక్ష్మీపూర్‌ ప్రాంతం నుంచి కటక్‌ వైపు వెళ్తున్న బస్సు సోమవారం రాత్రి పది గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న బస్సును డ్రైవర్‌ అదుపు చేయలేకపోయాడు. దీంతో అదుపుతప్పిన వాహనం రోడ్డుపక్కనే ఉన్న పంటపొలాల్లో బోల్తా పడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యారు. బస్సులో ప్రయాణిస్తున్న మరో 15 మంది తీవ్రగాయాల పాలయ్యారు. బస్సు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వాళ్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖపట్టణంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్‌తోపాటు అతని సహాయకుడు, ఒక ప్రయాణికుడు మృత్యువాతపడినట్లు ఆ జిల్లా కలెక్టర్‌ ప్రమోద్‌ బెహెరా తెలిపారు.